
అంతేనా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడికి వెళ్లినా కూడా చిత్ర బృందం మొత్తం నిధి అగర్వాల్ ను పొగిడేసింది . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కూడా "నిధి అగర్వాల్ ని చూసి సిగ్గేసింది అని ..సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను ఆమె తన భుజాలపై మోసింది అని .. ఆమెను చూసాకే నేను సినిమా ప్రమోట్ చేయాలి అని నిర్ణయించుకొని.. ఇలా రాత్రి నిద్ర పోకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నానని ఈవెంట్లో మాట్లాడారు". దీంతో నిధి అగర్వాల్ పేరు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతూ వచ్చింది . సినిమా రిలీజ్ అయిపోయింది . సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకునేసింది . కలెక్షన్స్ కూడా బాగా కలెక్ట్ చేసి పెట్టింది .
మేకర్స్ ఫుల్ హ్యాపీ.. పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ . నిధి అగర్వాల్ నటన కి మంచి మార్కులు పడ్డాయి . నిధి అగర్వాల్ కూడా హ్యాపీనే . అయితే హరిహర విరమణ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిధి అగర్వాల్ మరింత హ్యాపీగా మారిపోయింది. దానికి కారణం ఆమె ఒక బిగ్ బడా పాన్ ఇండియా సినిమాలో అవకాశమందుకోవడమే . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నాని - శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ ఫిక్స్ అయింది అంటూ న్యూస్ బయటకు వచ్చింది.
నిధి అగర్వాల్ ని హరిహర వీరమల్లు సినిమాలో చూసిన కొన్ని క్లిప్స్ బాగా ఆకట్టుకున్నాయి అని .. ఆ తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు శేఖర్ కమ్ముల - నాని అంటూ న్యూస్ బాగా వైరల్ గా మారింది. నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్ కి పాన్ ఇండియా సినిమాలో అవకాశం రావడం అంటే చాలా చాలా అదృష్టం ఉండాలి . ఎన్నో సినిమాలల్లో ఆమె నటించి హిట్ కొట్టుండాలి . కానీ పవన్ కళ్యాణ్ సినిమాతో నటిస్తే ఇక ఏ సినిమాలో నటించకపోయినా నో ప్రాబ్లం . అవకాశాలు అవంతటా అవే వచ్చేస్తాయి అని చాలామంది అంటూ ఉంటారు. మరొకసారి నిధి అగర్వాల్ విషయంలో అదే ప్రూవ్ అయింది . మంచి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది నిధి అగర్వాల్ . ఇక ఆమె కెరియర్ మొత్తం జిల్ జిల్ జిగా అంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు..!!