
ఈ సినిమాలో మొత్తంగా 20 నిమిషాల సీన్లు వి ఎఫ్ ఎక్స్ లోనే ఉంటాయి . సెకండ్ హాఫ్ లో హార్స్ రైడింగ్ సీన్ ..తోడేలు సీన్.. కోహినూరు వజ్రం దొంగలించేందుకు వీరమల్లు జర్నీ సీన్స్ అన్నీ కూడా మనకి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లను కనిపిస్తాయి . అయితే అవి చాలా నాసిరకంగా ఉండడంతో జనాలు హరిహర వీరమల్లు సినిమాలో అది నెగిటివ్ పాయింట్ అంటూ ట్రోల్ చేశారు. అయితే సినిమాకి ఆ నెగిటివ్ పాయింట్ కూడా ఉండకూడదు అంటూ మూవీ మేకర్స్ ఈ సెన్సేషనల్ డెసీషన్ తీసుకొని మొత్తంగా 20 నిమిషాలు ఉన్న సీన్లను డిలీట్ చేసేసారు .
ఇంతకుముందు 2 గంటల 42 నిమిషాలు ఉన్న నిడివి ఇప్పుడు 2 గంటల 22 నిమిషాలకి వచ్చేసింది . ఈ సీన్ల కారణంగా సెకండ్ హాఫ్ కు భారీ దెబ్బ పడుతుంది అంటూ మూవీ టీం గుర్తించి ఈ పని చేసింది. అయితే అలా తొలగించిన సీన్స్ తీసేసి కొత్త వర్షన్ ని మేకర్స్ నేటి నుంచి థియేటర్స్ లో ప్రదర్శితం చేస్తున్నారట. దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ అంతా బ్యాక్ గ్రౌండ్ లోనే సెట్ చేసేసారు టీం అంటూ తెలుస్తుంది . దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది . కాగా ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు . ఏ ఎం నిర్మాణం వహించారు. సినిమాకి బాగా హైలైట్ గా మారింది కీరవాణి మ్యూజిక్. కొత్త వర్షన్ ని అప్డేట్ చేస్తే వీరమల్లుకి ఆ నెగిటివ్ టాక్ కూడా ఉండదు . ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ లో అలాంటి సీన్స్ చూడలేక బాగా ఇబ్బంది పడ్డారు . ఇకపై అలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు . ఆ సీన్స్ ని ట్రీమ్ చేసేసారు కొత్త వర్షన్ అప్డేట్ చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!!