టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మళ్లీ రావా , జెర్సీ సినిమాలకు దర్శకత్వం వహించి రెండు మూవీలతో కూడా మంచి విచాలని అందుకుని దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న గౌతమ్ తిన్ననూరి  ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు ఈ మూవీ నిర్మాత పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని జులై 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను ఈ మూవీ బృందం మొదలు పెట్టింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం ఈ సినిమా కోసం చాలా పెద్ద రిస్క్ చేయనున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే... కొంత కాలం క్రితం దాదాపు చాలా సినిమాలకు విడుదలకు ముందు రోజే ప్రీమియర్ షో లను ప్రదర్శిస్తూ వచ్చారు.

ఇక కొన్ని సినిమాలకు ప్రీమియర్ షో ల ద్వారా మంచి టాక్ వచ్చినట్లయితే మొదటి రోజు ఆ మూవీలకు మంచి కలెక్షన్లు రావడం ,అదే ప్రీమియర్ షో లకు నెగిటివ్ టాక్ వచ్చినట్లయితే ఆ మూవీలకు మొత్తానికి కలెక్షన్లు మొదటి రోజు తగ్గడం జరిగిన సందర్భాలు ఉన్నాయి. దానితో చాలా మూవీ బృందాలు ప్రీమియర్ షో లను వేయడం తగ్గించేశారు. కానీ కింగ్డమ్ మూవీ యూనిట్ మాత్రం ప్రీమియర్ షో లను పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానితో చాలా మంది కింగ్డమ్ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారా మంచి టాక్ వస్తే ఓకే కానీ ఒక వేళ ప్రీమియర్ షో ల ద్వారా మూవీ కి కాస్త నెగటివ్ టాక్ వచ్చిన ఈ మూవీ కలెక్షన్లు మొదటి రోజు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd