టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ అంటేనే అభిమానులకు ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి జోడీపై మాత్రం ఫ్యాన్స్ లో డబుల్ హైప్. గతేడాది ప్రేమలో విరబూసి గ్రాండ్‌గా పెళ్లిచేసుకున్న ఈ జంట, త్వరలో పేరెంట్స్‌గా ప్రమోట్ అవబోతున్నారు. ప్రస్తుతం లావణ్య గర్భధారణ కాలాన్ని ఎంజాయ్ చేస్తుండగా, భర్త వరుణ్ ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. తాజాగా ఈ జంట ఫారిన్ వెకేషన్‌ నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వరుణ్-లావణ్య జంటను మిడియ‌వారు క్లిక్‌మనిపించారు. పింక్ హుడీ ధరించిన లావణ్య బేబీ బంప్‌తో కనిపించగా, వరుణ్ క్యాజువల్ షర్ట్, జీన్స్‌లో మామూలుగానే కనిపించాడు.


ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ చిరునవ్వులతో ముచ్చటించుకుంటూ కార్లోకి వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ “క్యూట్ కపుల్”, “ప్రీతి పేరెంట్స్”, “బేబీ తేజ్‌కి అడ్వాన్స్‌ కంగ్రాట్స్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ జంటపై స్పందనలు మామూలుగా లేవు. లావణ్య బేబీ బంప్ ఫస్ట్ టైం కనిపించడం వలన నెటిజన్లలో మంచి ఎమోషనల్ కనెక్షన్ కలిగింది. ఫాన్స్‌కి ఈ హ్యాపీ మోమెంట్ పూర్తిగా హార్ట్‌టచింగ్‌గా మారింది. ఇదిలా ఉండగా, వరుణ్‌ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు.


షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ జరుపుతున్నట్లు ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఓ అప్డేట్‌ ఇచ్చాడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. కెరీర్‌లో వరుణ్ ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్నా, భార్య లావణ్యతో సమయం గడిపేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు. తరచూ వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అవుతుండటమే ఇందుకు నిదర్శనం. ప్రేమగా పెళ్లి చేసుకొని, ఇప్పుడు కుటుంబ బాధ్యతలవైపు అడుగులు వేస్తున్న ఈ మెగా జంట, నిజంగానే అందరికీ “ఫ్యామిలీ గోల్స్” అంటూ నిలుస్తోంది!



మరింత సమాచారం తెలుసుకోండి: