పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం థియేటర్లో ఇంకా రన్నింగ్ అవుతోంది. ఈ చిత్రం కోసం భారీగానే ప్రీమియర్స్ షోలు వేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా టికెట్ల ధరలు భారీగా పెంచడంతో కొంతమేరకు ఈ సినిమా పైన నెగిటివిటీ ఏర్పడింది. అంతేకాకుండా అభిమానులు ఎంతో ఆశ పెట్టుకొని మరి సినిమాకి వెళ్లగా వారందరిని నిరుత్సాహపరిచింది. పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం నచ్చలేదు.దీంతో చాలామంది అభిమానులు సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలనే డిమాండ్ ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమా టికెట్ల రేటు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి ఈ సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు అందుబాటులోకి తీసుకురాబోతోంది. జులై 24న వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.91 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు వినిపిస్తోంది. బుక్ మై షో ఇతరత్రా యాప్ లలో కూడా టికెట్లు మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మరింత ప్రేక్షకుల దగ్గర చేరవేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


సింగిల్ స్క్రీన్ లలో బాల్కానికి రూ.175 రూపాయలు మల్టీప్లెక్స్ లలో రూ.295 రూపాయలకి టికెట్ల ధరలు లభించనున్నాయి . దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. సినిమా టికెట్ల ధరలు అధికంగా ఉండడం వల్ల కుటుంబంతో సహా వెళ్లలేని పరిస్థితులు ఉండేవి..  తగ్గ టికెట్లతో కొంతమేరకు పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఇందులో విఎఫ్ఎక్స్ సరిగా ఉపయోగించలేదని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఆడియన్స్. రెండో భాగంలో వచ్చే సన్నివేశాలు బాగున్నప్పటికీ విఎఫ్ఎక్స్ కారణంగానే ట్రోల్ కి గురవుతున్నాయి. అలాగే చివరిలో క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. అందుకే చిత్ర బృందం ఇందులో కొన్ని సన్నివేశాలను తీసేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: