
రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే ఆమె కన్నడలో కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో నటిస్తూ తెలుగులోకి అడుగు పెడుతోంది. ఈ చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతోంది.
తాజాగా విక్రమ్ సినిమా ఆఫర్ రావడంతో రుక్మిణి వసంత్ కెరీర్‌కు మరింత ఊపునిచ్చినట్లయింది. ప్రేమ్ కుమార్ గతంలో '96' వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. విక్రమ్, ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రుక్మిణి వసంత్ నటనకు మంచి అవకాశం లభిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ ఆఫర్ తో కోలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రుక్మిణి వసంత్ కెరీర్ పరంగా పుంజుకోవడానికి కారణమయ్యే అవకాశం అయితే ఉంది. రుక్మిణి వసంత్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రుక్మిణి వసంత్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ హీరోయిన్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు