తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శర్వానంద్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా కెరియర్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన హీరోగా నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో హీరోగా కూడా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఆఖరుగా శర్వానంద్ "మనమే" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్ "నారీ నారీ నడుమ మురారి" అనే సినిమా లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మాత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా విడుదల తేదీ బయటకు రావాలి అంటే ముందు ఆ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ కంప్లీట్ కావాలి.

ఓ టి టి సంస్థలు ఏ తేదీన వారికి అందుబాటులో ఉంటుందో అందులో ఒక తేదీని నిర్మాతలకు చెప్పడం , అందులో నుండి ఒక దానిని నిర్మాతలు ఎంచుకోవడం అనేది ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా ఓ టీ టీ సంస్థలపై ఆధారపడి విడుదల తేదీలను కన్ఫామ్ చేసుకుంటూ వస్తున్నాయి. నారీ నారీ నడుమ మురారి సినిమాకు సంబంధించిన ఓ టీ టీ ఇంకా కంప్లీట్ కాలేదు అని , అది కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతవరకు ఈ సినిమా విడుదల తేదీపై అప్డేట్ వచ్చి అవకాశాలు లేవు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: