జ్యోతి కృష్ణ ..అంతకు ముందు వరకు ఈ పేరు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది . దానికి వన అండ్ ఓన్లీ రీజన్ పవన్ కళ్యాణ్ ..ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన పవన్ కళ్యాణ్ ఇక  సినిమాలలో నటించాడు అని ..సినిమాలలో కనిపించడు అని జనాలు అభిమానులు తెగ ఫీలైపోయారు . కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను చకచక షూట్ కంప్లీట్ చేసేసారు . సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేసేస్తున్నారు . తాజాగానే  హరిహర వీరమల్లు సినిమాను పక్క ప్లానింగ్ తో థియేటర్స్ రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే .


సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది . జులై 24వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల మనసు దోచేసింది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత నటించిన ఫస్ట్ సినిమా రిలీజ్ అయి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఈ మూమెంట్లోనే హరిహర వీరమల్లు డైరెక్టర్ పేరు బాగా ట్రెండ్ అవ్వడం మొదలైంది . అయితే ఇప్పుడు జ్యోతి కృష్ణ మరొక జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.



జ్యోతి కృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్టర్ చేసిన తర్వాత అందరూ హీరోలు కూడా ఆయనతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇదే మూమెంట్లో టాలీవుడ్ ఇండస్ట్రిలో  నేచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నానితో చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. సినీ వర్గాలలో ఇప్పుడు ఇదే బాగా వైరల్ గా మారింది . ఈ స్క్రిప్ట్ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ తెలుస్తుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుందట . పాన్ ఇండియా హీరో నాచురల్ స్టార్ తో సినిమా కోసం ఇప్పుడు చాలామంది డైరెక్టర్ లు ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యంగా శేఖర్ కమ్ముల తో  ఆయన ఒక సినిమా కి కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపించింది . ఇలాంటి మూమెంట్లోనే జ్యోతి కృష్ణ కూడా ఆ లిస్టులో ఉండడంతో ఇండస్ట్రీలో ఇప్పుడు జ్యోతి కృష్ణ పేరు మారుమ్రోగిపోయేలా చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: