
1). భగవంత్ కేసరి:
బాలకృష్ణ ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. మహిళల సామర్థ్యాన్ని ప్రోత్సహించేలా కనిపిస్తారు బాలయ్య. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి తెరకెక్కించారు.
ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రానికి అవార్డు లభించింది.
2).హనుమాన్:
హనుమంతుడి నుంచి శక్తి లభించడం.. ఆ శక్తి వల్ల హీరో చేసే సాహసాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి సూపర్ హీరో కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.
హనుమాన్ చిత్రానికి బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు లభించింది.(నందు, పృథ్వీ)
అలాగే హనుమాన్ సినిమాకి ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ కింద మరో అవార్డు లభించింది.
3). బలగం:
పల్లెల నేపథ్యంలో కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలను చూపించే భావోద్వేగ కథ. వేణు డైరెక్టర్ గా వ్యవహరించారు.
బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు అనే సాంగ్ కు నేషనల్ అవార్డు వచ్చింది. (కాసర్ల శ్యామ్)
బేబీ:
ప్రేమ, స్వార్థం ,లవ్ ఫెయిల్యూర్ వంటివి యూత్ కి సందేశంగా చాలా ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ వైష్ణవి నటన సినిమాకి బలంగా మారింది.
ఉత్తమ స్క్రీన్ ప్లే.. బేబీ చిత్రానికి (సాయి రాజేష్ నీలం)
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - బేబీ చిత్రానికి (పివి ఎస్ఎస్ రోహిత్)
గాంధీ తాత చెట్టు:
ప్రకృతి పరిరక్షణ, పిల్లల ఆలోచన ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని తెరకెక్కించిన చిత్రంగా నిలిచింది.
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా సుకృతి వేణి -గాంధీ తాత చెట్టు. (సుకుమార్ కుమార్ కూతురు)