
ఆగస్టు 14వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . హైదరాబాద్ టు ముంబై తిరిగేస్తూ ఉన్నాడు. కాగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి గా ఫ్రెండ్షిప్ చేస్తాడు అనే విషయం ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్లకు మాత్రమే తెలుసు . కాగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక బిగ్ బడా స్టార్ ఫ్రెండ్షిప్ పేరు తో మోసం చేశాడు అన్న వార్త మరొకసారి ట్రెండ్ అవుతుంది.
ఎన్టీఆర్ రైట్ హ్యాండ్ గా పిలుచుకునే ఈ స్టార్ ఆయన పేరు చెప్పి జనాల దగ్గర డబ్బులు దోచేసుకున్నాడు . ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు కోట్లకు పైగానే డబ్బులు మొత్తం దుబారా చేశాడు . అదేవిధంగా ఎన్టీఆర్ పేరుని కూడా బ్రష్టు పట్టించాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఈ విషయం ఎన్టీఆర్ కి ఆలస్యంగా తెలియడంతో జనాలు ఆయన పేరు నమ్మి డబ్బులు మోసపోవడంతో ఎన్టీఆర్ ఆ అప్పులను మొత్తం క్లియర్ చేశాడట . అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది . అయితే ఈ ఇష్యూ పై ఎప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు . కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఇది నిజమే అన్న టాక్ వినిపించింది . ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరొకసారి ఇదే వార్తను వైరల్ చేస్తున్నారు జనాలు..!