తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఒకప్పుడు యాంకరింగ్ అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది ఉదయభాను. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా అద్భుతమైన చతురతతో ఆమె నడిపించేది. ఆ తర్వాత  యాంకరింగ్ రంగంలోకి ఝాన్సీ, సుమ కూడా వెళ్లారు. ఆమె కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. వీరి తర్వాత అంతటి స్థానాన్ని అధిరోహించిన వారిలో యాంకర్ సుమ ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది. ఇక మేల్  యాంకర్లలో యాంకర్ రవి మంచి ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఈయన తర్వాత ప్రదీప్ మాచిరాజు దూసుకుపోతున్నాడు. కానీ మేల్ యాంకర్లలో ఈ యాంకరింగ్ అనేది ముందుగా మొదలుపెట్టింది మాత్రం రవి అని చెప్పవచ్చు. అలాంటి ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒక విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. అదేంటి చూసేద్దాం.. 

రవి యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉండగానే బిగ్ బాస్ నుంచి ఆఫర్లు వచ్చాయి.  ఆయన వారిని సున్నితంగా తిరస్కరించుకుంటూ వచ్చారట. అలా బిగ్ బాస్ వారు నాలుగైదు సార్లు ఈయనకు ఆఫర్ ఇచ్చారు అయినా రిజెక్ట్ చేశారు. చివరికి వారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నేను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే వస్తానని ఓసారి చెప్పాడు. దీనికి బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఒప్పుకుందట. చివరికి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడట.. ఈ బిగ్ బాస్ కి వెళ్లడం వల్ల నేను ఇండస్ట్రీలో సంపాదించుకున్న పేరంతా నాశనం అయిపోయింది. నిజానికి బిగ్ బాస్ కి వెళ్ళినవారు నేను నటించలేదు, జెన్యూన్ గానే ఎలా ఉంటానో అలాగే ఉన్నానని చెప్పుకొస్తారు. కానీ అందులోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పకుండా నటిస్తారు. మన చుట్టూ వందలాది కెమెరాలు ఉంటాయి. ఆ షోకి  చాలామంది డైరెక్టర్లు 10 మంది వరకు రచయితలు ఉంటారు.

వాళ్ళు ఏ విధంగా చెబితే ఆ విధంగా మనం నడుచుకోవాల్సి వస్తుంది. ఈ షోకి వెళ్లిన తర్వాత ఒకరిపై ఒకరికి తప్పకుండా అసూయ పెరుగుతుంది. ఎవరు కూడా జెన్యూన్ గా ఉండాలన్నా అస్సలు ఉండలేరు. ప్రతి ఒక్కరు కెమెరా ముందు నటించి హైప్ కావాలనే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు నటించే వారే తప్ప నిజంగా వారు బయట ఎలా ఉంటారో ఆ విధంగా ఉండలేరని, నేను బిగ్ బాస్ కు వెళ్లి నటించలేదని ఎవరైనా చెబితే వారిని చెప్పుతో కొడతాను అంటూ సీరియస్ అయ్యాడు. ఈ విధంగా బిగ్ బాస్ వెళ్లడం వల్ల  నా పేరు ఎంతో చెడిపోయిందని నేను ఏర్పాటు చేసుకున్న యాంకర్ సామ్రాజ్యం అంతా కూలిపోయిందని  బాధపడ్డాడు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: