గతంలో ఎక్కువగా లవ్ , ఫ్యామిలీ డ్రామా చిత్రాలలో నటించింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. కానీ ఈమధ్య ఎక్కువగా లేడీ ఓరియంట్ చిత్రాలలోనే కాకుండా తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండే పాత్రలలో కనిపిస్తోంది. అలా ఇప్పుడు తాజాగా నటించిన చిత్రం పరదా. డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర బృందం వేగవంతం చేసింది. అందులో భాగంగానే పరదా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.



పరదా సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఒక గ్రామీణ నేపద్యంలో సాగే కథ అన్నట్లుగా కనిపిస్తోంది. ఒక గ్రామంలో ఉండే కఠినమైన సాంప్రదాయాలు, కట్టుబాట్ల వల్ల మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు కష్టాలు వాటిని ఎదుర్కోవడానికి హీరోయిన్ చేసే ప్రయత్నమే ఈ పరదా సినిమా కథ అన్నట్టుగా కనిపిస్తోంది. సుబ్బు పాత్రలో (అనుపమ) నటించగా.. దర్శన్ రాజేంద్రన్ ,సంగీత లాంటివారు మరో కీలకమైన పాత్రలో కనిపించారు. ఇలా వీరు ముగ్గురు కూడా విభిన్నమైన దారులకు చెందిన వీరు ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు, మలుపులు ఏంటన్నవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.


ముఖ్యంగా  ట్రైలర్లో  సుబ్బు తన మొహాన్ని ఎప్పుడూ కూడా పరదా తోనే కప్పేస్తూ ఉంటుంది. ఆమె అలా చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది ఈ సినిమాల ట్విస్ట్ అన్నట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్ మధ్యలో కూడా కొన్ని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమా ట్రైలర్ల విషయంతో పోలిస్తే మాత్రం పరదా సినిమా కొంత డిఫరెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. అనుపమ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు 22 వరకు ఆగాల్సిందే.. వీటితో పాటు అనుపమ డిటెక్టివ్, లాక్ డౌన్, బైసన్ వంటి చిత్రాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: