
అయితే స్టేజ్ పైకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన స్పీచ్ లో ప్రతి ఒక్కరిని పొగిడేస్తూ మాట్లాడారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని.. బాలీవుడ్ డైరెక్టర్ ని..ఆయన కెరియర్ స్టార్ట్ అయినప్పుడు తనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తన భార్యకి తన పిల్లలకి ప్రతి ఒక్కరి పేరుని ప్రస్తావించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు . రేవంత్ రెడ్డి గురించి కానీ భట్టి విక్రమార్క గురించి గానీ అసలు పోలీస్ శాఖ గురించి గానీ ఎక్కడ ప్రస్తావించలేదు. వెనుక ఉన్నవారు కూడా ఎవరు హింట్ ఇవ్వలేదు. దీంతో ఆనందంగా జూనియర్ ఎన్టీఆర్ తన స్పీచ్ క్లోజ్ చేసేసారు .
అయితే ఆ తర్వాత విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు . ఆయన ఎందుకు అలాంటి తప్పు చేశారో కూడా ఆ వీడియోలో క్లారిటీ ఇచ్చారు . ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.." క్షమించండి రేవంత్ రెడ్డి సార్ ..ఇందాక నా సినీ జర్నీ గురించి మాట్లాడుతూ ఆనందంలో పోలీస్ శాఖ కి మీకు ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయా.. మీరు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చేసిన పనులు ఎప్పటికీ మర్చిపోలేను.
నా అభిమానులతో పాతిక సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఒక తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలకు నా కృతజ్ఞతలు . ముఖ్యంగా శ్రీ రేవంత్ రెడ్డి గారికి మల్లు భట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు . మీరు చేసిన సహాయానికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను" అని ఎన్టీఆర్ ఆ వీడియోలు మాట్లాడారు . అయితే అప్పటికే ఎన్టీఆర్ గురించి రావాల్సిన నెగిటివిటి మొత్తం వచ్చేసింది . సోషల్ మీడియాలో ఆయనని బాగా ట్రోల్ చేసేస్తున్నారు . దీంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!