
అయితే, ప్రభాస్ మాత్రం తన సినిమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. చేతిలో అరడజను కంటే ఎక్కువ సినిమాలు పెట్టుకున్న ప్రభాస్.. "స్పిరిట్" సినిమాకి ఒక సంవత్సరం కాల్షీట్స్ ఇచ్చాడని ఒక వార్త ఇటీవల బాగా వైరల్ అయింది. కానీ ఆ వార్త పూర్తిగా ఫేక్ అని మూవీ టీమ్ ఖండించింది. ఈ సినిమాకి ప్రభాస్ కేవలం ఆరు నెలల కాల్షీట్స్ మాత్రమే కేటాయించాడని.. మొత్తంగా ఆరు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ప్లాన్ ఉందని టీమ్ తెలిపింది. ఇది నిజంగా చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి. అయితే రిస్క్ తీసుకోవడంలో, దాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంలో సందీప్ రెడ్డి వంగా ఎప్పుడూ వెనుకాడడని మనం అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాల ద్వారా చూశాం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యిందని, ఆయన త్వరలోనే లొకేషన్‌లోకి అడుగుపెట్టబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు.
ఈ వార్త విని జనాలు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ప్రభాస్ ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తిచేస్తే, అది ఒక మైల్‌స్టోన్ అవుతుంది. ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాకీ ఆరు నెలల కాల్షీట్స్ ఇచ్చి, ఇంత తక్కువ సమయంలో సినిమా పూర్తి చేసిన సందర్భాలు లేవు. కాబట్టి ఇది నిజమైతే, స్పిరిట్ సినిమా ప్రభాస్ కెరీర్‌లో స్పెషల్ ప్లేస్ సంపాదించడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది..!