జాతీయ జెండా అంటే ప్రతి ఒక్కరికి గౌరవమే..అయితే అలాంటి భారత జాతీయ జెండాని మెగాస్టార్ చిరంజీవి అవమానించారంటూ ఒక సంచలన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. దేశభక్తి ఉన్నవాళ్లు ఇలాంటి వీడియో చూస్తే మాత్రం చిరంజీవిని తిట్టకుండా ఉండలేరు.. మరి ఇంతకీ జాతీయ జెండా ఎగరవేసే సమయంలో చిరంజీవి చేసిన తప్పిదం ఏంటి.. ఎందుకు సోషల్ మీడియాలో చిరంజీవిని ఏకిపారేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశం జాతీయ జెండాను ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. ఈ జెండాని కింద పారవేయడం గానీ,తొక్కడం కానీ,చింపి వేయడం కానీ చేయవద్దని  ముందుగానే సూచనలు ఇస్తారు. అంతేకాదు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అయిపోయాక జాతీయ జెండాలను తిరిగి భద్రంగా తీసి జాగ్రత్తగా భద్రపరుస్తారు. 

అలాగే జాతీయ జెండాలను తగలబెట్టడం వంటివి చేయరు. అయితే అలాంటి జాతీయ జెండాని ఎగురవేసే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక తప్పు చేశారు. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి ఇండిపెండెన్స్ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ వద్ద సెలబ్రేషన్స్ నిర్వహించారు.ఇక బ్లడ్ బ్యాంక్ దగ్గర జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో చిరంజీవితో పాటు ఆయన కూతురు అలాగే అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.ఇక ఎప్పట్లాగే చిరంజీవి ఆగస్టు 15 నాడు బ్లడ్ బ్యాంక్ దగ్గర జాతీయ జెండాని ఎగరవేశారు. కానీ అలా జాతీయ జెండా ఆవిష్కరణ చేసే సమయంలో చిరంజీవి తన కాలుకి షూలు వేసుకొని ఉండడంతో చాలామంది ఈ వీడియో చూసి మెగాస్టార్ పై మండి పడుతున్నారు.అయితే ఆయన పక్కనే ఉన్న అల్లు అరవింద్ మాత్రం చెప్పులు విడిచి జాతీయ జెండాని గౌరవిస్తే చిరంజీవి మాత్రం షూలు అలాగే వేసుకొని జెండాను ఎగరవేసి జాతీయ జెండాను అగౌరవపరిచారు అంటూ మాట్లాడుకుంటున్నారు.

చిరంజీవి మాత్రమే కాదు ఆయన వెనుక చుడిదార్ లో ఉన్న అమ్మాయి కూడా చెప్పులు వేసుకొని జెండాకు వందనం చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది చిరంజీవిని ఏకిపారేస్తున్నారు. అసలు మీకు బుద్ధుందా? ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో ఎవరైనా షూలు వేసుకుంటారా? మీరేమైనా ఆర్మీ లేదా పోలీసు అధికారి అనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు.. మరి సోషల్ మీడియాలో ఆయన పై వస్తున్న ఈ విమర్శల గురించి చిరంజీవి స్పందిస్తారా.. షూలు వేసుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసినందుకు క్షమాపణ చెబుతారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: