జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాను కావాలనే టిడిపి అడ్డుకుందని అన్న వార్తలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఎందుకు ఇంత డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది అని ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఆడియోలో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


"మా హీరోకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. మా హీరో 15 ఏళ్ల క్రితమే ఆ విషయం గురించి స్పష్టంగా మాట్లాడారు. అయితే అనవసరంగా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్‌ను లాగుతున్నారు?" అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆడియోలో .."నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న తారక్ సినిమాలు ఇండస్ట్రీలో ఆడనివ్వబోమని, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సక్సెస్ కాకుండా చేస్తామని ఓపెన్ సవాల్ విసిరినట్లు మాట్లాడారు. అంతేకాదు, "నేను ఎమ్మెల్యేను, ఈ సినిమాను నిలిపివేయాలి" అని హెచ్చరించినట్లు కూడా ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో లీక్ కావడంతో తారక్ అభిమానులు ఆగ్రహంతో మండిపడుతున్నారు.



“ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎలా మాట్లాడగలరు? ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం కాదు, ఆయన వెనక పెద్ద రాజకీయ వ్యక్తులే ఉన్నారు” అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఆయన ఇంటి వద్ద, ఆయన రాజకీయ ఫ్లెక్సీలు, కటౌట్లు చించిపారేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆగ్రహాన్ని గమనించిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, “అది నేను మాట్లాడిన ఆడియో కాదు, ఫేక్ ఆడియో. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాను” అని వివరణ ఇచ్చారు. “ఎన్టీఆర్ అభిమానుల మనసు నొచ్చుకున్నట్లు  భావిస్తే సారీ” అంటూ వీడియో రిలీజ్ చేశారు.  అయినా అభిమానులు శాంతించలేదు.  “ఇంతటి మాటలు అన్నాక కేవలం వీడియోలో క్షమాపణలు చెప్పడం సరిపోదు. బహిరంగ ప్రెస్‌మీట్ పెట్టి ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ క్షమాపణలు చెప్పాలి” అంటూ డిమాండ్ చేస్తున్నారు.



చాలామంది అభిమానులు ఈ నిరసనలను ప్రశంసిస్తున్నా, కొంతమంది మాత్రం “హీరోల విషయానికి మీకెంత బాధ?” అంటూ టార్గెట్ చేస్తున్నారు. అయినప్పటికీ, వార్ 2 సినిమా ఫ్లాప్‌కి కారణం రాజకీయ కుట్రలేనని ఫైనల్‌గా బయటపడింది. ముందు నుంచే నందమూరి ఫ్యామిలీ–జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని, టిడిపి కూడా ఎన్టీఆర్ పట్ల సానుకూలంగా లేనని ఈ ఘటన మరింత బలపరిచింది. ఇప్పటి పరిణామాలను చూస్తుంటే, జూనియర్ ఎన్టీఆర్‌ను కావాలనే టిడిపి, నందమూరి ఫ్యామిలీలోని పెద్దలు అణగదొక్కారని అభిమానులు మండిపడుతున్నారు. కొందరు పరోక్షకంగా “దీనికి లోకేష్ ప్రధాన సూత్రధారి” అని ఆరోపిస్తున్నారు. “దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పేవరకు మా నిరసనలు ఆగవు” అని ఎన్టీఆర్ అభిమానులు ఓపెన్‌గా చెబుతున్నారు. ఈ పరిణామాలపై ఇప్పటివరకు ఎన్టీఆర్ స్పందించకపోవడం జనాలకి కొత్త డౌట్లు తీసుకొస్తుంది..!







మరింత సమాచారం తెలుసుకోండి: