అక్కినేని నాగార్జున గారి కొడుకు నాగచైతన్య తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల జాబితాలో నిలబడటానికి కేవలం తన టాలెంట్‌పైనే ఆధారపడి ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఎదుగుతున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో ఫ్లాప్స్‌ చూసినా, ఆ ఫ్లాప్స్ ని అసలు పట్టించుకోకుండా, వాటిని పాజిటివ్‌గా మార్చుకుని మరింత కష్టపడుతూ ముందుకు సాగాడు. ఇటీవల "తందేల్" సినిమాతో ఘనవిజయం సాధించిన నాగచైతన్య, తన కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లోకి చేరాడు. ఈ విజయంతో ఆయనకు పెద్ద స్థాయిలో ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత బలపరచడానికి వరుసగా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ తన కెరీర్‌ గ్రాఫ్‌ను ఎగబాకేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.


ప్రస్తుతం ఆయన, దర్శకుడు చందుముండేటి దర్శకత్వంలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవకముందే తన తర్వాతి సినిమాకు కూడా కమిట్ అయినట్లు సమాచారం. మొదటగా నాగచైతన్య, కోలీవుడ్ డైరెక్టర్‌కి ఒక అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పటికీ, చివరికి ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ లక్కీ ఛాన్స్‌ను టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు శివ కొరటాలకి ఇచ్చినట్లు ఫిలిం నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
శివ కొరటాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఒకే ఒక్క ఆచార్య సినిమా ఫ్లాప్ అయినా, దాన్ని పక్కన పెట్టేస్తే ఆయనకు ఉన్న సక్సెస్ రేట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి డైరెక్టర్‌తో నాగచైతన్య కలిసి సినిమా చేయబోతున్నాడంటే, అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ కావడం సహజమే.



ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు దాదాపు ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నట్లు సమాచారం. కథన్ని నాగచైతన్య వినగానే బాగా నచ్చడంతో, నాగార్జున కూడా దీనికి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజును ఎంపిక చేసినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు ట్రెండింగ్ అవుతున్నాయి. నాగచైతన్యశివ కొరటాల కాంబినేషన్‌ ఖచ్చితంగా టాలీవుడ్‌లో మరో బిగ్ హిట్ అందిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: