
అయితే ఈ సినిమా మొదట 2024 లోనే విడుదల చేస్తారని భావించినప్పటికీ గ్రాఫిక్స్ కారణంగా చాలా ట్రోల్స్ వినిపించాయి. దీంతో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాకపోవడంతో వాయిదా వేసినట్లు వినిపించాయి. అందుకే తిరిగి మళ్లీ విఎఫ్ఎక్స్ ,గ్రాఫిక్స్ పనులను కూడా మరింత ఆకట్టుకునేలా తీసేలా చూస్తున్నారట. ట్రైలర్ రిలీజ్ లో ఖచ్చితంగా హైప్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. డైరెక్టర్ కూడా అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.
తాజాగా విశ్వంభర సినిమా విడుదల డేట్ పైన ఒక న్యూస్ అయితే టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే దీపావళి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ సీజన్ ని సైతం క్యాష్ చేసుకొనేలా అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ అని కూడా ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర బృందం భావిస్తుందట. మరి ఈ విషయం పైన అఫీషియల్ గా మేకర్స్ స్పందిస్తే కానీ అసలు క్లారిటీ రాదని అభిమానులు తెలుపుతున్నారు. మరి ఈసారైనా సరైన రిలీజ్ డేట్ ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తుందో లేదో చూడాలి మరి. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. వీరితోపాటు మరి కొంతమంది నటిస్తున్నారు.