
ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర చిత్రం నుంచి ఈ అప్డేట్ రావడంతో అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. గ్లింప్స్ విషయానికి వస్తే.. ఈ విశ్వంలో అసలు ఏం జరిగిందో ఈ రోజైనా చెబుతావా మొర అనే డైలాగుతో మొదలవుతుంది. ఆ వెంటనే బ్యాక్ గ్రౌండ్లో మెయిల్ వాయిస్ తో ఒక్కడి స్వార్థం యుద్దంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది అంటూ చెబుతారు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి లుక్స్ , బిజిఎం డైలాగులతో యాక్షన్ సన్నివేశంతో ఎంట్రీ ఇస్తారు. చిరంజీవిని చూపించిన తీరు కూడా ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.
విశ్వంభర సినిమాకి సంబంధించి ఈసారి మాత్రం ఎలాంటి ట్రోల్స్ లేకుండా చూపించారు వశిష్ఠ. గ్లింప్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విశ్వంభర చిత్రాన్ని విడుదల చేయవలసి ఉండగా విఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అయ్యిందని.. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చూపించారు.