ఒక సినిమా థియేటర్లలోకి వచ్చింది అంటే దాని వెనక ఎంతో మంది కష్టం దాగి ఉంటుంది. దర్శక నిర్మాతలు మెయిన్ గా ఉంటారు. కానీ వీరి వెనుక సపోర్ట్ చేసే కార్మికులు ఎవరికి కనబడరు. వీరి కష్టం సినిమా తీయడంలో  అత్యధికంగా ఉంటుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడుతున్నటువంటి కార్మికులకు  కాస్త న్యాయం జరిగిందని చెప్పవచ్చు. కార్మికుల వేతనాలు పెంచాలనే డిమాండ్ తో నిరవధిక సమ్మెకు 18 రోజులుగా షూటింగులు బంద్ చేసి మరీ వారి నిరసన తెలియజేశారు. చివరికి 18 రోజుల తర్వాత దిగి వచ్చినటువంటి  సినిమా నిర్మాతలు, సంఘాలు, ప్రభుత్వ సినీ పెద్దలు కార్మికుల డిమాండ్లకు అంగీకారం తెలిపారు. అయితే వేతనాలు 30% పెంచుతామని ప్రకటన చేశారు.

 ప్రభుత్వం కలగజేసుకొని సయోధ్య కూదర్చడంతో షూటింగులు  పునః ప్రారంభమయ్యాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కార్మిక శాఖ  సపోర్ట్ చేస్తుందని నిర్మాత దిల్ రాజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తామని అన్నారు. ఇదే తరుణంలో లేబర్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ..కార్మికులకు 30% పెరుగుదల అనేది జరుగుతుందని, మూడు నాలుగు కండిషన్స్ మీద ప్రధానంగా చర్చలు జరిపామన్నారు. ఈ చర్చల్లో 22.5 శాతం వేతనాల పెంపనేది ఉంటుందని వెల్లడించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నామని మిగతా చిన్న చిన్న సమస్యల కోసం ఈ కమిటీ పని చేస్తుంది అని తెలియజేశారు.

కమిటీని నివేదిక ప్రకారమే తదుపరి నిర్ణయాలు ఉంటాయని అన్నారు. అలాగే ఫిల్మ్ ఫెడరేషన్  అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. ఇకనుంచి షూటింగ్స్ యధావిధిగా కొనసాగుతాయని, కార్మికులంతా హాజరుకావాలని తెలియజేశారు. ఎప్పుడైనా మాలో మేమే చర్చలు చేసుకొని సమ్మె విరమించుకుంటాం కానీ ఈసారి కార్మిక శాఖ చొరవ తీసుకుందన్నారు. అయితే ఈ వేతన పెంపు అనేది  విడతల వారీగా ఉంటుందని తెలియజేశారు. మొదటి ఏడాది 15శాతం, రెండవ ఏడాది 2.5శాతం, మూడో ఏడాది ఐదు శాతం ఉంటుందని  తెలియజేశారు. ఈ విధంగా సినీ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటూ పోదామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: