- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతూ హోరెత్తిస్తున్నారు. గోదావ‌రి జిల్లా అభిమాని ఒక‌రు.. చిరుకు అప్ప‌ట్లో తాను ఎంత వీరాభిమానిలా ఉండేవాడినో పెట్టిన మెసేజ్ ఆక‌ట్టుకుంది. ఆ మెసేజ్ య‌ధావిధిగా చూస్తే నేను చిన్నప్పుడు బడికెళ్లాలంటే మధ్యలో రెండు సినిమా ధియేటర్లను దాటుకెళ్లాలి..పెద్దేవం శ్రీనివాసా..మలకపల్లి శ్రీలక్ష్మీ (గతంలో వెంకటేశ్వర) ( ఈ రెండు ఇప్పుడు తూర్పుగోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నాయి) ..రోజూ వారానికోసారి మారిన సినిమా పోస్టర్లన్నీ చూసుకుంటూ స్కూలుకు నడిచెళుతూ ఉండేవాళ్ళం..అప్పట్లో చిరంజీవి సినిమా పోస్టర్లన్నా, సినిమాలన్నా అదో వ్యసనం.


క్లాసులుఎగ్గొట్టి సినిమా హాల్లో చూసినా మళ్ళీ పెద్దేవం పెచ్చెరువు కాడ వీధి సినిమాలు వేస్తున్నారంటే మళ్ళీ అదే హడావుడి .. ఆ అభిమానానికి అసలు హద్దులంటూ లేవప్పుడు..నిజంగా ఎక్కడినుండి వచ్చాడండి..ఎలా వచ్చాడండి..ఇప్పుడెక్కడున్నాడండి..ఈ కేస్ట్ ఫీలింగులు,రాజకీయాలు ఎక్కువైపోయి జనాలు ఏదేదో మాట్లాడేస్తుంటారు గానీ... అనామకుడిగా వచ్చి తెలుగు సినిమాను పరుగులు పెట్టించింది చిరంజీవి కాదేటండి.. తెలుగు సినిమా ఎల్లలు దాటించిన కీర్తి తనది కాదాండి..ఆ రోజుల్లో ఎవడైతే చిరంజీవి సినిమా మొదటిరోజు చూస్తే వాడు హీరో ఖచ్చితంగా...ఎంతమంది అభిమానుల ఆదరాభిమానాలు కూడగట్టుకున్నాడో ..నిజంగా గొప్పోడు..ఆ రోజుల్లో చిరంజీవి సినిమా టికెట్ కొనుక్కోవడానికి ఇంట్లో ఎన్ని చిల్లర దొంగతనాలు చేసేవాల్లమో కదా తలచుకుంటేనే నవ్వొస్తోంది.


కేవలం కొంతమందికే సాధ్యమైన.. విపరీతమైన పోటీని తట్టుకుని ఇంతకాలం నెట్టుకురావడమంటే మాటలా...సుదీర్ఘకాలం నెంబర్ వన్ ప్లేసులో ఉండటమంటే మామూలు విషయమా...రంగం మారాక తనమీద రాళ్ళేసారు కానీ..రజనీకాంత్ లా ఇప్పటికీ అలా ఉండిపోయి ఉంటే తనవైపు చూసే దమ్ము ఎవడికైనా ఉందా...సినిమాలకు సంబంధించినంత వరకూ అప్పటికీ.. ఎప్పటికీ.. చిరంజీవే రారాజు...నీ సినిమా రిలీజులకు ఎగ్గొట్టిన క్లాసులు..ఇంట్లోవాళ్ళ క్లాసులూ.. క్యూలైన్లలో  చిరిగిన చొక్కాలూ.. మాకెప్పటికీ గుర్తుంటాయి..అందుకే ..అందుకోవయ్యా... విశ్వంభరా..హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: