
అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకీ కొన్ని టఫ్ సిట్యూయేషన్లు వస్తాయి. ఒక మంచి కథ మన దగ్గరకు వచ్చినప్పటికీ, అప్పటికే మన కాల్‌షీట్స్ వేరే సినిమాకు కేటాయించినప్పుడు ఆ సినిమాను వదులుకోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు మనం వదులుకున్న సినిమాలు బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అవుతాయి. ఆ తర్వాత “ఎందుకు ఆ మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందో” అని చాలా మంది స్టార్స్ బాధపడుతూ ఉంటారు. అదే పరిస్థితి మెగాస్టార్ చిరంజీవికి కూడా వచ్చింది. తన కెరీర్‌లో ఎన్నో సినిమాలను వదులుకున్న ఆయన, రెండు సినిమాల విషయంలో మాత్రం ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారు. కొంచెం టైమ్ అడ్జస్ట్ చేసుకుని ఆ సినిమాలు చేసి ఉంటే బాగుండేదని చాలా సందర్భాల్లో బాధపడ్డారు.
ఆ సినిమాలు ఇవే — "జెంటిల్మెన్ మరియు ఒకే ఒక్కడు". శంకర్ దర్శకత్వం వహించిన జెంటిల్మెన్ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అర్జున్ హీరోగా చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసింది. ఈ సినిమా తర్వాత అర్జున్ కి ఇండస్ట్రీలో స్టార్‌డమ్ దక్కింది. అంతేకాదు, ఈ సినిమాతో శంకర్ డైరెక్షన్‌కి కమలహాసన్ వంటి లెజెండ్స్ కూడా ఫిదా అయ్యారు. ఇండియన్ సినిమా ఛాన్స్ కూడా కమల్‌హాసన్ ఈ సినిమా చూసిన తర్వాతే శంకర్ కి ఇచ్చాడు. అయితే "ఒక్క ఒక్కడు"సినిమాను మొదటగా శంకర్, చిరంజీవితో చేయాలని అనుకున్నారు. ఆయన ఇంటికే వెళ్లి స్టోరీ వినిపించారట. కానీ అప్పటికే చిరంజీవి ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో కాల్‌షీట్స్ అడ్జస్ట్ కాలేక ఈ అవకాశాన్ని వదులుకున్నారు.ఆ తర్వాత ఈ చిత్రాన్ని అర్జున్ చేసి, తన కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలబెట్టుకున్నారు. ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ రెండు సినిమాలు చూసినప్పుడు చిరంజీవి, “నేను చేసి ఉంటే ఈ సినిమాలు ఇంకా బాగుండేవి” అని అనుకుంటారట. కొంతమంది మెగా ఫ్యాన్స్‌కైతే ఈ విషయం ఎప్పటికీ మర్చిపోలేని పీడకలగానే మిగిలిపోయింది.