రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆర్. నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్. నారాయణమూర్తి సమాజానికి ప్రయోజనం చేకూర్చే చిత్రాలలో ఎక్కువగా నటించిన సంగతి తెలిసిందే. బడుగు జీవుల వ్యథలను,  విప్లవ పోరాటాలను తెరపై సినిమాల ద్వారా చూపించిన నారాయణ మూర్తి విద్యా  వ్యవస్థలోని లోపాల ఆధారంగా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాను తెరకెక్కించారు.

కథ :

రామయ్య (ఆర్. నారాయణమూర్తి) ప్రభుత్వ ఉద్యోగి కాగా ఆయన కొడుకు అర్జున్ (ఆర్. నారాయణమూర్తి) కు సైతం తండ్రిలా ఆదర్శ భావాలుంటాయి. అర్జున్ ప్రభుత్వ పాఠశాలలో చదివి పోలీస్ జాబ్ సాధిస్తాడు.  రామయ్య తన మనవడు, మనవరాలిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని భావించగా కోడలు మాత్రం అందుకు అంగీకరించదు. అయితే పిల్లలు మాత్రం తల్లి మాట వినకుండా గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతారు.

అయితే మనవరాలు పరీక్షలో ఫెయిల్ కావడంతో సూసైడ్ చేసుకుంటుంది. అయితే ప్రయివేట్  యూనివర్సిటీ పేపర్ లీక్ మనవరాలి ఆత్మహత్యకు పరోక్షంగా కారణమని తెలుస్తుంది. ఈ విషయాలు తెలిసిన రామయ్య ఏం చేశాడు ?  యూనివర్సిటీ ఓనర్ నాగభూషణంపై పోరుకు ఏ విధంగా సిద్దమయ్యాడు? చివరకు ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

ఆర్. నారాయణమూర్తి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు చూడటానికి ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.  పేపర్ లీక్ అంశాలతో పాటు ఇంగ్లిష్ ఆవశ్యకతను ఈ సినిమాలో ప్రస్తావించారు.  చదువు కంటే జ్ఞానం ముఖ్యమనే అద్భుతమైన సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు.  విద్యార్థులపై ఒత్తిడి పెంచే తల్లిదండ్రులు, టీచర్లకు చెంపపెట్టులా ఈ సినిమా ఉంది.

విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సినిమాలో ప్రస్తావించారు.  విద్యా వ్యవస్థల చాటున ఎలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయో తెలిసేలా ఈ సినిమా కథాంశం ఉంది.  ఫీజు రీయింబర్స్ మెంట్ పేరుతొ జరిగే దోపిడీని సైతం ఈ సినిమాలో ప్రస్తావించారు.  సినిమాలోని కొన్ని సీన్స్ ప్రేక్షకులకు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాయి.

ఉద్యోగ నోటిఫికేషన్ల వెనుక ఉన్న అక్రమాలతో పాటు  గవర్నమెంట్ జాబ్స్ పేపర్ లీక్ గురించి కూడా సినిమాలో ప్రస్తావించారు.  

నారాయణమూర్తి  ఈ సినిమాలో  డ్యూయల్ రోల్ లో నటించగా రెండు పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. అయితే తన వయస్సుకు తగిన పాత్ర అయిన తాత  పాత్రలో ఈ నటుడు మెప్పించారు. చెప్పాలనుకున్న కథను తెరపై నిజాయితీగా చూపించాలని నారాయణమూర్తి ప్రయత్నించారు..

బలాలు : ఆర్. నారాయణమూర్తి నటన, డైరెక్షన్, సెకండాఫ్

బలహీనతలు : స్క్రీన్ ప్లే, ఫస్టాఫ్

మరింత సమాచారం తెలుసుకోండి: