
'RRR' ఇంటర్వెల్ సీన్‌ను మించిపోయే యాక్షన్ ఎపిసోడ్‌ను ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సింహాలతో చేసే ఒక ఛేజింగ్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం దక్షిణాఫ్రికాలోని దట్టమైన అడవుల్లో షూటింగ్ జరపనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ రానుందని తెలుస్తోంది, ఇది అభిమానులను ఎంతగానో ఆనందానికి గురి చేయనుంది. ఈ భారీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహేష్ రాజమౌళి కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా 3000 కోట్ల రూపాయల కలెక్షన్లను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు