టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది.. డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అలాగే సరికొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తదుపరి చిత్రాల కథల ఎంపిక విషయంలో స్టోరీ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పైన అభిమానులకు కూడా భారీగా అంచనాలు మొదలయ్యాయి. గ్లింప్స్ హైలెట్ కావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది.


సుమారుగా రూ.300 కోట్లతో ఈ చిత్రాన్ని వెంకట సతీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తల్లిగా మలయాళ నటి నటించమని అడగగా రిజెక్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె ఎవరో కాదు నటి స్వాసిక. రామ్ చరణ్ తల్లి పాత్ర ఆఫర్ వచ్చిందని ఈ మేరకు ఆమెను పెద్ది చిత్ర బృందం స్వయంగా అడిగినట్లుగా ఒక వీడియోలో తెలియజేసింది. కానీ ఆ పాత్రకు ఆమె సరిపోనని స్వాసిక రిజెక్ట్ చేశానని తెలియజేసేది.


రామ్ చరణ్ కు 40 సంవత్సరాల వయసు అయితే స్వాసిక 33 సంవత్సరాలట. దీంతో వయస్సు పైన తేడా అనే పద్యంలో ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్లు ఆమె తెలియజేసింది. నటి స్వాసికకు అధిక రెమ్యూనరేషన్ ఇస్తానన్నా కూడా ఒప్పుకోలేదట. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో మాత్రం ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. పెద్ది చిత్రం హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే ఇందులో కీలకమైన పాత్రలో శివరాజ్ కుమార్ తో పాటు జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో పెద్ది సినిమా పైన ఫుల్ ఫోకస్ పెట్టారు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: