
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న భారీ చిత్రాల్లో ఒకటి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా వస్తున్న “ ఓజి ”. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ప్రత్యేకంగా “ ఫైర్ స్టార్మ్ ” సాంగ్ వచ్చిన తర్వాత సినిమా హైప్ మరింత పెరిగింది. ప్రతి అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదేంటంటే పవన్ వారసుడు అకీరా నందన్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. “ ఫైర్ స్టార్మ్ ” సాంగ్‌లో కొన్ని షాట్స్ అకీరా బాడీ లాంగ్వేజ్, లుక్‌తో పోలికలు ఉన్నాయని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పాయింట్ అవుట్ చేశారు. దీంతో “ అకీరా సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడా ? ” అనే హాట్ టాపిక్ మొదలైంది.
ఇంతకుముందే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మూడు విభిన్న దశల్లో కనిపిస్తారని ఓ నటుడు రివీల్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకటి యువ పవన్ స్టేజ్. ఆ రోల్‌ను అకీరా చేయవచ్చని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అలా అయితే థియేటర్లలో సందడి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఇది అకీరా నందన్‌కి బెస్ట్ సిల్వర్‌స్క్రీన్ డెబ్యూ అవుతుంది. తన తండ్రి స్టార్‌డమ్‌తో పాటు, తనకున్న క్రేజ్ రెండూ కలిసొస్తే “ఓజి”లో అకీరా ఎంట్రీ మరింత సెన్సేషన్ అవుతుంది. ఏదేమైనా “ఓజి”పై అంచనాలు ఇంతకుముందే పీక్స్‌లో ఉండగా, అకీరా నందన్ ఎంట్రీ టాక్ హైప్‌ని మరింత పెంచేసింది. నిజంగా అకీరా ఈ సినిమాలో కనిపిస్తే, అది మెగా ఫ్యాన్స్‌కే కాకుండా మొత్తం టాలీవుడ్‌కు ఒక పెద్ద సర్ప్రైజ్ అవుతుంది.