సినిమా రిలీజ్ తర్వాత ఒక చిన్న సినిమా నిలబడటానికి మొదటి బలమైన సపోర్ట్ ఏదంటే… అది రివ్యూలే. పాజిటివ్ రివ్యూలు వస్తే ఆ రేటింగ్స్‌ని బిగ్‌గా హైలైట్ చేస్తూ, వాటిని ప్రచార ఆయుధంగా మార్చేసి ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించగలిగే అవకాశం ఉంటుంది. అదే రివ్యూలు తేడా కొడితే మాత్రం సినిమా సగం పోయినట్టే. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది “పరదా” సినిమా టీమ్. మహిళలు ఎదుర్కొనే సమస్యలపై సీరియస్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ముందే మంచి అంచనాలు ఉన్నాయి. దర్శకుడు ప్రవీణ్ & టీమ్ కూడా “క్రిటిక్స్ తప్పకుండా ఎంపతైజ్ అవుతారు” అన్న నమ్మకంతో “రివ్యూస్ చూసి థియేటర్స్‌కి వెళ్ళండి” అనే స్లోగన్‌ను ప్రచారంలో పెట్టారు. కానీ వారు ఊహించినది ఒక్కటీ జరగలేదు.


రివ్యూలలో మాత్రం “పరదా”కి అసలు స్కోప్ ఇవ్వలేదు. కంటెంట్ మీద ఆసక్తి లేకపోవడం, స్క్రీన్‌ప్లే స్లోగా ఉండటం, దర్శకత్వంలో లోపాలు కనిపించడం వంటి పాయింట్లపై చాలా మంది రివ్యూయర్స్ ఫైరయ్యారు. ఫలితంగా సినిమా మొదటి వేవ్‌లోనే నెగటివ్ షేడ్‌లోకి వెళ్లిపోయింది. అయినా “పరదా” టీమ్ వెనక్కి తగ్గలేదు. వెంటనే కొత్త స్లోగన్ రెడీ చేసుకున్నారు –  “మంచి సినిమాని ప్రేమించే ఆడియన్స్ తప్పకుండా థియేటర్స్‌కి వెళ్లండి. రివ్యూలు ఎందుకు ఇలా వచ్చాయో మీరు చూసాకే అర్థమవుతుంది!” అని కొత్త పల్లవి మొదలుపెట్టారు. ఇక దర్శకుడు ప్రవీణ్ మాత్రం క్లియర్‌గా అంగీకరించాడు – “అవును… సినిమాలో తప్పులు ఉన్నాయి. రివ్యూ రైటర్స్ వాటిని రాశారు. నేను కూడా మనిషినే, తప్పులు చేస్తాను” అని ఎమోషనల్‌గా కానీ, కూల్‌గా రియాక్ట్ అయ్యాడు.



కానీ హీరోయిన్ అనుపమ మాత్రం పూర్తిగా డిఫెండ్ చేసింది. “మీరు ఎందుకు తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు? కొంతమందికి ఇలాంటి సినిమాలు నచ్చవు. అది వారి ఇష్టం. మీరేం తప్పు చేయలేదు. కమర్షియల్ సినిమాల్లో వెయ్యి తప్పులు ఉన్నా ఎవరు పట్టించుకోరు. కానీ మహిళల సినిమాల్లో మాత్రం డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి” అంటూ రివ్యూలపై గట్టి ఆవేశం వ్యక్తం చేసింది. అంతేకాదు, “ఇది వైన్‌లా ఉంటుంది … స్లో పాయిజన్‌లా మెల్లగా జనాలకి ఎక్కుతుంది” అంటూ పాజిటివ్ హోప్‌ను చూపించింది. కానీ ఇండస్ట్రీ రియాలిటీ మాత్రం వేరే. ఈరోజుల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాతే సినిమా జాతకం తేలిపోతుంది. నెగటివ్ టాక్ వచ్చిన సినిమాలు తిరిగి పుంజుకోవడం చాలా అరుదు. పెద్ద సినిమాలే (ఉదా: వార్ 2, కూలీ) రికవర్ కాలేకపోయాయి. అలాంటప్పుడు “స్లో పాయిజన్ హిట్” ఆశించడం అంటే అసలు ప్రాక్టికల్ కాదు. మొత్తానికి, “పరదా” టీమ్ రివ్యూలను ఎదుర్కొంటూ, తమదైన పాజిటివ్ స్లోగన్‌తో బతికే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆడియన్స్ తీర్పే ఫైనల్ – అది ఎటు మలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: