
అయితే తాజాగా ఈ ముగ్గురు వ్యక్తులు మేము మొదలైర్ రెండవ భార్య పిల్లలమంటూ ముందుకు రావడం జరిగింది. దీంతో తాము ఆ స్థిరాస్తి పైన హక్కు కలిగి ఉన్న వారసులమంటూ తెలియజేశారు.ఆ ఆస్తిని ఆక్రమించేందుకు కూడా ప్రయత్నం చేశారట. దీనిపైన తీవ్రంగా ఫైర్ అయిన బోనీ కపూర్ 2025 ఏప్రిల్ 22న మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు అన్ని వివరాలను పరిశీలించి 1975లో మొదలైర్ రెండవ భార్యని చేసుకున్నారని ఆ ముగ్గురు తెలిపారు. కానీ ఈయన మొదటి భార్య మాత్రం 1999లో మరణించారు.
దీన్నిబట్టి భార్య బ్రతికి ఉన్న సమయంలోనే రెండో వివాహం చేసుకోవడం వల్ల హిందూ వారసత్వ చట్టం ప్రకారం రెండో భార్య పిల్లలకు ఇది గుర్తింపు పొందలేరంటూ కోర్టు తెలియజేసింది. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం తమ పరిధిలో ఉండే తహసిల్దారు వద్ద నుండి చట్టబద్ధమైన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పొందడంతో అది మోసపూరి పత్రం అని బోని కపూర్ ఆరోపణలు చేశారు. దీనిపైన విచారణ జరిపి మరో నాలుగు వారాలలో సరైన నిర్ణయం తెలియజేయాలంటూ తాసిల్దారును హైకోర్టు ఆదేశాలను జారీ చేశారు.బోని కపూర్ వాదనకి బలం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.