టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో నిఖిల్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ అనే మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నిఖిల్ సోలో హీరో గా నటించడం మొదలు పెట్టాడు. హ్యాపీ డేస్ మూవీ తర్వాత ఈయన నటించిన సినిమాలు చాలా వరకు అపజాయాలను అందుకున్నాయి. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది. అలాంటి సమయం లోనే ఈయన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో తిరిగి ఈయన కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత నుండి ఈయన ఆచీ చూచి సినిమాలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు.

దానితో స్వామి రారా సినిమా తర్వాత ఈయన నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా అందులో కొన్ని మూవీలకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నిఖిల్ "స్వయంభు" అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ ,  నబా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇకపోతే నిఖిల్ తాజా గా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువబడింది. నిఖిల్ తన తదుపరి మూవీ ని ఎస్విసి ఎల్ఎల్పి బ్యానర్లో చేయబోతున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఈ మూవీ బృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ను గమనిస్తే ఈ మూవీ గ్రాఫిక్స్ సినిమాగా రూపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే గానీ జరిగితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకేక్కే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: