
అంతే కాదు, అదే రోజున ఇతర ఛానల్స్ లో వచ్చిన నాగచైతన్య “తండేల్” (5.08), సిద్దు జొన్నలగడ్డ “జాక్” (4.45) రేటింగ్స్ తో పోలిస్తే చాలా పెద్ద లాభం తెచ్చుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అర్బన్ ఏరియాస్ లో మాత్రం “జాక్” (5.80) ముందంజలో ఉండగా, పట్టణాలు – గ్రామాల్లో మాత్రం “సంక్రాంతి”కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 2005లో విడుదలైన “సంక్రాంతి” అప్పట్లోనే బ్లాక్‌బస్టర్ హిట్. తమిళ మూవీ “ఆనందం”కి రీమేక్ అయినా, తెలుగులో ఆ సినిమా సూపర్ ఫాలోయింగ్ సంపాదించింది. వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ కనెక్ట్ ఈ సినిమాను థియేటర్లలో హౌస్‌ఫుల్స్ చేయించగా, బుల్లితెరపై కూడా మళ్లీ మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతోంది.
సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్, ఎస్.ఏ. రాజ్‌కుమార్ స్వరపరిచిన మెలోడీ పాటలు, క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ మళ్లీ మళ్లీ చూసే రిపీట్ వేల్యూని తెచ్చాయి. మస్ హీరోయిజం, చీకటి యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తున్న ఈ రోజుల్లో, ప్రేక్షకులకు ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలే కావాలని తేల్చేశారు.ఈ మధ్య “సంక్రాంతి” రీటెలికాస్ట్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, మన దర్శకులు మిస్ అవుతున్నది ఇదేనని అర్థమవుతుంది. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు బుల్లితెరపై రాణించకపోయినా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న పాత క్లాసిక్స్ మాత్రం కొత్త సినిమాలను సైతం వెనక్కు నెడుతున్నాయి. మొత్తానికి, మరోసారి “సంక్రాంతి” బుల్లితెరపై కనకవర్షం కురిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.