టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నారు. హీరోయిన్గా రితికా నాయక్ నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో జగపతిబాబు, శ్రియ నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాను కూడా అత్యంత భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మిరాయ్ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మరింత అంచనాలను పెంచేసింది. ఈ సినిమాతో తేజ సజ్జా ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.


సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంది. ముఖ్యంగా మిరాయ్ సినిమా ట్రైలర్ ఎండింగ్ లో శ్రీరాముడి పాత్రను చూపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ పాత్రలో ఎవరు నటించారనేదే? చర్చనీయాంశంగా మారింది. రాముడు పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించారనే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం పైన చిత్ర బృందం కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ విషయం పైన హీరో తేజ సజ్జా క్లారిటీ ఇచ్చారు.


ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజ సజ్జా రాముడు పాత్రలో నటించింది మహేష్ బాబునేనా అని కొంతమంది ప్రశ్నించారు?. అందుకు తేజ సజ్జా మాత్రం అలాంటిదేమీ లేదు అంటూ రూమర్స్ కి చెక్ పెట్టారు. మిరాయ్ చిత్రంలో రాముడు పాత్రలో ఎవరు నటించారనే విషయం తెలియాలి అంటే మీరు సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆగాల్సిందే అంటూ తెలియజేశారు. తేజ సజ్జా నటిస్తున్న చిత్రాలు అందర్నీ ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉంటాయి.మీరాయ్ చిత్రం ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: