
బాలీవుడ్ హీరోలకి ఉన్న స్వాగ్, స్టైల్‌ని సౌత్ దర్శకులు వాడుకోకపోతే వారి పాత్రలు బలహీనంగానే మిగిలిపోతాయి. కానీ "ఓజీ"లో మాత్రం పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. లేటెస్ట్ గ్లింప్స్‌లో ఇమ్రాన్‌ని ఓమీగా పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్‌ని షాక్‌లోకి నెట్టింది. స్టైలిష్ లుక్, రాయల్ బాడీ లాంగ్వేజ్, విలన్ పాత్రలో ఇమ్రాన్‌కు ఉన్న గ్రేస్ అద్భుతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రకు సమానంగా, ఎదురెదురుగా నిలబడే శక్తివంతమైన విలన్‌ని సుజిత్ క్రియేట్ చేసినట్టే అనిపిస్తోంది. సినిమా ఫార్ములా ఒకటే – హీరో ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, విలన్ కూడా అంతే బలంగా ఉంటేనే క్లాష్ రసవత్తరంగా ఉంటుంది.
ఇక అదే సూత్రాన్ని "ఓజీ"లో పాటిస్తున్నట్టు ట్రైలర్స్ చెబుతున్నాయి. ఇమ్రాన్ హష్మీకి భారీ పారితోషికం ఇచ్చారని, దానికి తగిన రీతిలో తన వర్కౌట్, లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో 100% న్యాయం చేశాడని టాక్ వస్తోంది. ఇమ్రాన్‌ని విలన్‌గా సెట్ చేయగలిగితే, టాలీవుడ్‌కు కొత్త నెక్స్ట్ లెవల్ విలన్ దొరికినట్టే అవుతుంది. అంతేకాదు, "ఓజీ" పాన్ ఇండియా రేంజ్‌లో హైప్ పెరిగేందుకు కూడా ఇమ్రాన్ హష్మీ పేరు బాగా ఉపయోగపడనుంది. ఇప్పుడు మొత్తం అంచనాలూ ఒకటే – ఓజీ వర్సెస్ ఓమీ క్లాష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేది! చూడాలి .