విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వెంకటేష్ హీరోగా రూపొందిన నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా వెంకటేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పటికే వెంకటేష్ కు కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా రెండు విజయాలను అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పని చేస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మూవీ లో వెంకటేష్ సరసన హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు ..? అనే దానిపై ఇప్పటివరకు మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. దానితో వెంకటేష్ సరసన ఈ బ్యూటీ హీరోయిన్గా నటించబోతుంది అని అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ మూవీ లో వెంకటేష్ సరసన రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయి అని ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఉంది అని మరో వార్త అయింది. ఇక ప్రస్తుతం శ్రద్ధ శ్రీనాథ్  , నేహా శెట్టి , శ్రీ నిధి శెట్టి ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని వెంకటేష్ సినిమాలో హీరోయిన్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని మరో వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే దాదాపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే సినిమాలలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. దానితో వెంకటేష్ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉంది అని ,  ఇప్పటివరకు ఈ మూవీ బృందం వారు పరిశీలించిన నటీమణులంతా మంచి అందగత్తెలు కావడంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే అది సినిమాకు మరింత ప్లస్ అవుతుంది అని కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: