సినిమా ఇండస్ట్రీలో చేసే చాలామంది నటీనటులు మంచి స్టార్డం వచ్చాక రాజకీయాల్లో కూడా అడుగు పెడుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున ఇలా ఎందరో ఉన్నారు. ఇక మహిళ నటీమణుల్లో  రోజా, జయప్రద, జయసుధ లాంటి వారు ఉన్నారు. ఈ విధంగా సినిమాల్లో ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోయిన్ దివ్యవాణి. ఈమె అప్పట్లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత టిడిపి పార్టీలో చేరింది. ఈమె చేరిన కొత్తలో ఆ పార్టీ వారు చాలా ప్రియారిటి  ఇచ్చారు. దీంతో సినిమాలు తగ్గించుకొని పూర్తిగా రాజకీయాలకు పరిమితమైంది. తెలుగుదేశం పార్టీలో ప్రముఖ మహిళా నాయకురాలిగా కూడా చాలా ఏళ్లు కొనసాగారు. మహిళల విషయంలో ఏది మాట్లాడాలన్నా మీడియా ముందు ఈమెనే కనిపించేవారు. అలాంటి ఈమెకు పార్టీ నుంచి అనేక అవమానాలు ఎదురయ్యాయట. 

అంతేకాదు చివరికి ఆ పార్టీలో అవమానాలను తట్టుకోలేక ఆమె ఆ హీరో ముందుకు వెళ్లి కన్నీరు పెట్టుకుని ఏడ్చిందట. ఈ విషయాన్ని దివ్యవాణి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో దివ్యవాణి ని యాంకర్  తెలుగుదేశం పార్టీలో మీరు అనేక అవమానాలు పడ్డారు..రెండున్నర  ఏళ్ల పాటు మిమ్మల్ని హింసించారట కదా నిజమేనా అని అడిగితే.  అవును నిజమే నేను చాలా ఇబ్బందులు పడ్డాను.చివరికి నా బాధ ఎవరికి చెప్పుకోలో తెలియక బాలకృష్ణ ఇంటికి వెళ్లి మరీ ఏడ్చానని చెప్పుకొచ్చింది. నేను యాక్టివ్ గా పని చేస్తున్న సమయంలో నాకేం కావాలో పార్టీ నుంచి అందేది కాదు.. దీనికి తోడు నన్ను చులకనగా చూసేవారు.. ఒక్కోసారి కొంతమంది నాయకులు నీకు చాలా ఎక్కువవుతుంది దివ్యవాణి అంటూ బెదిరించారు.
ఆ టైంలో నాకు టిడిపిలో ఈ విషయాన్ని ఏ నాయకుడితో చెప్పాలో అర్థం కాలేదు, నేరుగా బాలకృష్ణ ఇంటికి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చాను అని చెప్పుకొచ్చింది.. ఆయన నా బాధను అర్థం చేసుకొని, నీ విషయంలో జరుగుతున్న సంఘటనలన్ని గమనిస్తున్నానమ్మా, టైం వచ్చినప్పుడు అన్నింటిని సెట్ చేద్దాం. నువ్వేం భయపడకు అని భరోసా ఇచ్చారని అన్నది.. కానీ నేను ఇక ఆ పార్టీలో ఉండడం వేస్ట్ అనుకోని బయటకు వచ్చేసానని పేర్కొంది. ఇక దివ్యవాణి సినిమాల విషయానికొస్తే..ఈమె ఇండస్ట్రీలో ఎక్కువగా రాజేంద్రప్రసాద్ తో సినిమాలు చేసింది. ముత్యమంతా ముగ్గు, పెళ్లి పుస్తకం, దోషి, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం  వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: