తెలుగు ప్రేక్షకులకు లేడీ కమెడియన్ గా బాగా సుపరి చితురాలు నటి గీతా సింగ్. ఈమె కితకితలు  సినిమాతో తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే అంతకుముందు జై, ఎవడి గోల వాడిది సినిమాలలో నటించిన పెద్దగా పేరు రాలేదు. సుమారుగా 50కుపైగా చిత్రాలలో నటించింది గీతా సింగ్. గీతా సింగ్ తన కామెడీతో ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో అంతలా తన పర్సనల్ జీవితంలో కూడా ఎన్నో కష్టాలను చవిచూసింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా సింగ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం జరిగింది.


గీతా సింగ్ మాట్లాడుతూ.. తన జీవితంలో రెండుసార్లు సూసైడ్ అటెండ్ చేశానని వెల్లడించింది. తనకు తెలిసిన ఒక మహిళా దగ్గర రూ .22 లక్షల వరకు చీటీ వేయగా.. అందుకు సంబంధించి డబ్బులు అడిగితే.. ఇస్తామని చెప్పి రాత్రికి రాత్రి ఆ ఇల్లు కాలి చేసి పారిపోయారని తెలిపింది గీతా సింగ్. ఈ మోసం జరిగి 8 సంవత్సరాలు అవుతూ ఉన్న ఇప్పటికి కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. అయినా కూడా ఆ మహిళ పట్టించుకోలేదంటూ ఎమోషనల్ గా మాట్లాడింది గీతా సింగ్. ఎంతో కష్టపడి డబ్బులు దాచుకుంటే ఇలా మోసం చేసి పోయారని తెలిపింది. సూసైడ్ నుంచి బయటికి రావడానికి తన అక్కే ముఖ్య కారణం అంటూ తెలిపింది గీతా సింగ్.


గీతా సింగ్ ఇప్పటికి వివాహం చేసుకోలేదు తన అన్న కొడుకుని దత్తకు తీసుకొని పెంచానని.. కానీ అతడు ఒక వయసు వచ్చాక యాక్సిడెంట్లు మరణించడం తనకు తీరని లోటుగా మారిపోయిందని ఎమోషనల్ గా మాట్లాడింది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనని చూసి చాలామంది హేళన చేశారని , కొన్ని సందర్భాలలో అవమానించారని కూడా తెలిపింది. ఇలా ఎన్నో వాటిని దిగమింగుకొని జీవిస్తున్నారని ఎమోషనల్ గా మాట్లాడింది. వీటికి తోడు  ఫ్యామిలీ సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉండిపోవడం వల్ల అవకాశాలు కూడా దూరం అయ్యాయని ఇప్పుడు ఒకవేళ వస్తే తిరిగి మళ్ళీ నటిస్తానంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: