తేజ సజ్జ తాజాగా మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమా రేపు అనగా సెప్టెంబర్ 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత తేజ నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 4 కోట్లు , ఆంధ్ర లో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 22 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , డబ్బింగ్ తో కలుపుకొని 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఓవర్ సిస్ లో 4.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 31.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా 32.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 32.50 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: