బిగ్ బాస్ తెలుగు అభిమానులు ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇక పోయిన వారం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు పెద్ద ఎత్తున ప్రారంభం అయింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 ప్రసారం కావడం , అందులో చిన్న చిన్న గొడవలు కూడా స్టార్ట్ కావడంతో బిగ్ బాస్ లవర్స్ ప్రస్తుతం ఈ షో ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం మనకు తెలిసిందే. ఇక అలా ఎలిమినేట్ అయిన వారిని ఎవరో ఒకరు పూర్వపు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు.

అలా ఇంటర్వ్యూ చేసే కార్యక్రమానికి బిగ్ బాస్ బజ్ అనే పేరును బిగ్ బాస్ బృందం వారు ఫిక్స్ చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఎవరు ఉంటారు అని బిగ్ బాస్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి ఎవరు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు అనే దానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 లో ఫైనల్ వరకు చేరుకున్న శివాజీ బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ బిగ్ బజ్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

బిగ్ బాస్ బృందం వారు అందుకు సంబంధించిన ఒక ప్రోమో ను కూడా విడుదల చేశారు. గతంలో ఆదివారం రోజు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కు సంబంధించిన బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ సోమవారం రోజు టెలికాస్ట్ అయ్యేది. ఇక నుండి అలా కాదు అని ఆదివారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కు సంబంధించిన ఎపిసోడ్ ఆదివారం రోజు రాత్రి ప్రసారం కానున్నట్లు కూడా ఈ ప్రోమో ద్వారా తెలియజేశారు. మరి ఈ సారి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి ఏ రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: