సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అయ్యే టాపిక్ ఏదైనా ఉందంటే, అందులో ప్రధానంగా వినిపించే విషయం సమంతనాగచైతన్య విడాకులే. వీరిద్దరూ విడాకులు తీసుకుని ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా, వీళ్లకు సంబంధించిన వార్తలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ప్రతి చిన్న విషయానికీ వీళ్ల విడాకుల మేటర్‌ను లాగి సోషల్ మీడియా వేదికలపై రచ్చ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం కూడా మరోసారి నాగచైతన్య – సమంతల విడాకుల విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల జీవితంలో కొత్త అతిథి రాక. మనందరికీ తెలిసిందే, ఇటీవల లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త బయటకొచ్చిన వెంటనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు, ఇండస్ట్రీలోని పెద్దలు అందరూ ఆమెకు, వరుణ్ తేజ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా ఫ్యామిలీలోకి కొత్త వారసుడు వచ్చాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.


ఈ క్రమంలో వరుణ్ తేజ్ – లావణ్య తమ బిడ్డ ఫొటోలు, ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల క్రింద అనేకమంది స్టార్ సెలబ్రిటీలు “కంగ్రాట్యులేషన్స్” అంటూ విషెస్ అందించారు. ఈ జాబితాలో సమంత కూడా ఉన్నారు. ఆమె హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈ కామెంట్స్ మధ్య నాగచైతన్య కూడా తన శుభాకాంక్షలను అందించారు. ఇక్కడికే అసలు ట్విస్ట్ మొదలైంది. నాగచైతన్య పెట్టిన శుభాకాంక్షల క్రింద ఒక నెటిజన్ సూటిగా ప్రశ్నిస్తూ – “మీరు సమంతకి ఎందుకు విడాకులు ఇచ్చారు?” అంటూ అడిగాడు. ఈ కామెంట్ ఒక్కటే సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్ రూపంలో కాసేపట్లో వైరల్ అయిపోయింది. దీంతో మళ్లీ గతంలో ముగిసిపోయిన ఒక వ్యక్తిగత విషయాన్ని బయటకు లాగి తెచ్చి సోషల్ మీడియాలో చర్చించటం మొదలైంది.



వాస్తవానికి నాగచైతన్యసమంత విడాకులు తీసుకున్నాక ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారు. నాగ చైతన్య రెండో పెళ్ళి చేసుకునేశాడు. సమంత గురించి ఇప్పుడు రెండో పెళ్లి వార్తలు కూడా వస్తున్నాయి. సమంత తన కెరీర్‌లో కొత్త కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి, నెటిజన్లు మాత్రం “ఇంకా మీరు సమంతకి ఎందుకు విడాకులు ఇచ్చారు?” అనే ఒక్క ప్రశ్నపై మళ్లీ దృష్టి సారించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సాధారణ ప్రజలలో చాలా మంది ఈ విధానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం, వాళ్లకంటూ ఒక ప్రైవసీ ఉంటుంది. ఎందుకు పదేపదే వారి విడాకుల విషయాన్ని లాగి గుర్తు చేస్తున్నారు? ఎంతకాలం అదే విషయం మీద చర్చించబోతున్నారు?” అంటూ మండిపడుతున్నారు. సమంతనాగచైతన్య విడాకులు వారి వ్యక్తిగత నిర్ణయం అని, అది చాలాకాలం క్రితమే ముగిసిపోయిందని, ఇప్పుడు కొత్త విషయాలు, కొత్త ఆనందాలను ప్రోత్సహించడం నేర్చుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
అంతా జరిగిపోయిన తర్వాత కూడా, మళ్లీ మళ్లీ ఈ విడాకుల మేటర్‌ను గుర్తు చేసుకోవడం అవసరమా? అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో, సోషల్ మీడియా వేదికల్లో జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: