
అభినవ్ తన అనుభవాలను కొనసాగిస్తూ, “సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ సోదరుడు సోహైల్ ప్రతి విషయానికీ జోక్యం చేసేవాడు. నటుల ఎంపిక నుంచి పారితోషికం వరకు అతని ఆధీనంలో ఉండేది. అంతేకాదు, సల్మాన్ సోనూ సూద్ ఫిజిక్ చూసి ఈర్ష్యపడేవాడు. ఆ కారణంగా ఆయనకు అసౌకర్యంగా వ్యవహరించేవాడు” అని చెప్పారు. దబాంగ్ మొదటి దశలో అనుపమ్ ఖేర్, ఓం పురి వంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ, ధర్మేంద్రను తీసుకోవడానికి అభినవ్ వెనుకడుగు వేశాడట. కారణం .. గతంలో జరిగిన ఒక రూమర్. 2017లో మిడ్‌డేలో వచ్చిన కథనం ప్రకారం, దర్శకుడు కాంతి షా తన తక్కువ బడ్జెట్ సినిమాలో ధర్మేంద్ర సన్నివేశాన్ని అసభ్యంగా రీ –ఎడిట్ చేశాడు. ఆ విషయం బయటకు రావడంతో హీరో సన్నీ డియోల్ ఆ దర్శకుడిని కొట్టాడట. ఈ సంఘటన మదిలో ఉండటంతోనే ధర్మేంద్రను తీసుకోవడానికి అభినవ్ ధైర్యం చేయలేదని చెప్పాడు.
సల్మాన్ ఖాన్ గురించి ఇంతవరకు ఎన్నో రూమర్స్ వచ్చినా, ఒక డైరెక్టర్ ఇలా బహిరంగంగా మాట్లాడటం చాలా అరుదు. అభినవ్ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీ రెండు వైపులా చర్చలు మొదలయ్యాయి. కొంతమంది ఆయన మాటలు నిజమని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది పర్సనల్ గాయంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అని భావిస్తున్నారు.ఏదేమైనా, ‘దబాంగ్’తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ జోడీ మధ్య ఇంతటి వివాదం వెలుగులోకి రావడం బీ–టౌన్‌లో మరోసారి సల్మాన్ ఇమేజ్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసింది.