జూబ్లీహిల్స్.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు.. 2023 ఎలక్షన్స్ లో  బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మాగంటి గోపీనాథ్ అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు. కానీ ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.  దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. సిట్టింగ్ సీట్ ను మళ్లీ సంపాదించుకోవాలని బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ ను దెబ్బకొట్టి సీట్ కొట్టేయాలని  బిజెపి ఎదురుచూస్తోంది. ఇలా త్రిముఖ పోరు నడుస్తున్న తరుణంలో  మరో అభ్యర్థి ఈ పోరులోకి రానున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఆయన కన్ఫామ్ అయిపోయి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం తప్పకుండా గెలిచే అవకాశాలు  ఉంటాయని చెప్పవచ్చు. మరి ఆ పార్టీ నుంచి అభ్యర్థి పోటీ చేస్తే నష్టం జరిగేది కేసీఆర్ పార్టీకే అంటూ ఒక చర్చ నడుస్తోంది. మరి ఆ అభ్యర్థి ఎవరో ఆ వివరాలు చూద్దాం..

 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 ఓట్లు ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఓట్లు ముస్లింలవే. లక్ష5 వేలకు పైగా ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఏ పార్టీ పోటీ చేసినా వారి సపోర్ట్ ఉంటే తప్పకుండా విజయం సాధించే అవకాశాలుంటాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు  ఎంఐఎం,బీఆర్ఎస్ అభ్యర్థికే సపోర్ట్ చేస్తూ వచ్చింది. దీంతో మాగంటి గోపీనాథ్ విజయం సాధిస్తూ వచ్చారు. కానీ ఆయన మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. దీంతో కీలక రోల్ లో ఎంఐఎం పార్టీ  ఉండబోతుందని చెప్పవచ్చు. ఇదిలా ఉన్న తరుణంలో కాంగ్రెస్ ఎవరికి సీటు ఇవ్వాలనే దానిపై అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుండి మాగంటి గోపీనాథ్ భార్యకు సీటు ప్రకటిస్తూ అనౌన్స్ చేసింది. ఇక బిజెపి నుంచి ఎవరు అనేది ఫైనల్ చేయలేదు.

ఇదే సందర్భంలో సరికొత్త టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో కాస్త పేరున్నటువంటి ముస్లిం నాయకుడు అలీ ఖాన్ కూడా పోటీలో ఉంటారని  తెలుస్తోంది. అయితే ఈయన తాజాగా కేసీఆర్ కూతురు కవితను కలిశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాను జాగృతి నుంచి పోటీ చేస్తానని అడిగి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కవిత ఓకే చెబితే మాత్రం ఆయన జాగృతి పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ జాగృతి పార్టీ నుంచి అలీ ఖాన్ పోటీ చేస్తే మాత్రం తప్పకుండా ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీపై పడుతుంది. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి ఈజీగా బయటపడే అవకాశం ఉంది. మరి కవిత అలీఖాన్ కు సీట్ ఇచ్చి నాన్నకు వెన్నుపోటు పొడుస్తుందా? లేదంటే సైలెంట్ గా రిజెక్ట్ చేస్తుందా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: