వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడి.. అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే,దిశా పటానీ, శోభన, రాజేంద్రప్రసాద్  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో చాలామంది దర్శకులు, నటీనటులు గెస్ట్ రోల్స్ చేశారు. అలా రాజమౌళి,ఆర్జీవి,అనుదీప్, ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్,విజయ్ దేవరకొండ, మాళవిక లు కనిపించారు. అలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గత ఏడాది జూన్లో విడుదలైన కల్కి 2898Ad మూవీకి చాలామంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా భవిష్యత్ ఎలా ఉంటుంది..కలియుగం అంతం కృష్ణుడు జన్మించడం ఇలా పురాణాలను బేస్ చేసుకొని తీశారు.ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే సుమతి పాత్రలో కనిపించింది. 

అయితే ప్రెగ్నెంట్ గా ఉన్న దీపిక కడుపులో కలి జన్మిస్తాడని ఆయనే ప్రపంచం అంతం కాకుండా చూస్తాడు అనే కాన్సెప్ట్ ని చూపించారు.ఇక ఫస్ట్ పార్ట్ లో దీపిక ప్రెగ్నెంట్ గానే ఉంటుంది. సెకండ్ పార్ట్ లో కలి పుట్టడాన్ని చూపిస్తారు. అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు దీపికా పదుకొనేని పార్ట్-2 నుండి తీసివేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కల్కి పార్ట్ 2 లో దీపిక పదుకొనే స్థానంలో ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.అయితే దీపిక పదుకొనేని రిప్లేస్ చేయాలంటే ప్రభాస్ పక్కన అంతటి హైలెట్గా కనిపించాలంటే కచ్చితంగా అది అనుష్కకి మాత్రమే సాధ్యం అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

ఇక అనుష్క ప్రభాస్ కాంబోలో ఇప్పటికే బాహుబలి 1,బాహుబలి 2 వచ్చాయి కాబట్టి మళ్లీ వీరి కాంబో ని అభిమానులు ఆదరిస్తారు. కల్కి పార్ట్ -2 లో దీపిక ప్లేస్ లో అనుష్క అయితేనే సెట్ అవుతుంది అని కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది ఏమో అనుష్క కాకుండా దీపిక ప్లేస్ లో ప్రియాంక చోప్రా కూడా బాగానే ఉంటుంది. ప్రియాంక చోప్రాని తీసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.అలా దీపిక ప్లేస్ ని రిప్లేస్ చేయగల సత్తా అనుష్క,ప్రియాంక చోప్రాలకు మాత్రమే ఉందని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మరి చిత్రయూనిట్ దీపిక పదుకొనే ప్లేస్ లో ఏ హీరోయిన్ ని తీసుకుంటారు అనేది ముందు ముందు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: