“తాను ఒకటి అనుకుంటే, దైవం మరొకటి నిర్ణయిస్తుంది” అన్న మాట ఈ మధ్య బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనేకి సరిగ్గా సరిపోతున్నట్టుంది. స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దీపికా, ఒక్కోసారి తీసుకునే నిర్ణయాల వల్ల, తాను ఊహించని షాక్‌లు ఎదుర్కొంటోందన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.  ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కల్కి 2898 ఆడ్ లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయం సాధించడంతో పాటు, పాన్-ఇండియా స్థాయిలో దీపికాకు మరోసారి గుర్తింపు తెచ్చిపెట్టింది. సహజంగానే ఆ సినిమాకి సీక్వెల్ అయిన కల్కి 2 లో కూడా ఆమెనే హీరోయిన్‌గా కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ షాకింగ్‌గా మేకర్స్ ఆమెను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించారు. నిర్మాణ సంస్థ దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యానికి గురైంది.


అంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి గ్లోబల్ హీరోయిన్ ను తప్పించడం చాలా అరుదు. అది కూడా దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయిన్ విషయంలో ఇలా జరగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది సరిపోకుండా, మరో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ మూవీ నుండి అవుట్ అయిన దీపికాను, ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ చిత్రంలోనూ తీసేయబోతున్నారన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఇక దీనికి గల కారణం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం – దీపికా షూట్ కి వెళ్ళేటప్పుడు తన పర్సనల్ స్టాఫ్‌లో దాదాపు 40-45 మందిని వెంట తీసుకెళ్తుందట. వాళ్లందరికీ లగ్జరీ రూములు, ప్రత్యేక ఫుడ్, ఇతర అన్ని సౌకర్యాలు అందించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అదనపు భారాన్ని నిర్మాతలు తట్టుకోలేకపోవడంతో, ఇకపై ఆమెను ప్రాజెక్టుల నుండి తప్పించే నిర్ణయానికి వచ్చారనే టాక్ వినిపిస్తోంది.



ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం – కల్కి 2 మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ సినిమా నుండి కూడా దీపికా పదుకొనేకి చెక్ పెడితే, ఆమె కెరీర్‌కి అది భారీ డామేజ్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా సౌత్‌లో కూడా తన మార్కెట్‌ను పెంచుకోవాలని కలలు కనిన దీపికా, వరుస షాక్‌లతో గట్టి కష్టకాలాన్ని ఎదుర్కొంటోందని అంటున్నారు. ఇక దీనిపై అట్లీ - బన్నీ ప్రాజెక్ట్ బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నిజంగా దీపికాను రీప్లేస్ చేస్తారా..? లేక ఈ వార్తలు కేవలం గాసిప్స్‌గా మిగిలిపోతాయా..? అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: