
వారి గుంతెమ్మ కోరికలు అన్నీ నిర్మాతలపై రుద్దుతూ ఉంటారు. తెలుగులో ప్రభాస్ కల్కి సినిమాలో దీపిక పదుకొనే నటించింది. తొలి భాగంలో అంత ప్రాముఖ్యత లేకపోయినా ఉన్నంతవరకు ఓకే అనిపించింది. ఆమె నటన చూడాలి అంటే సెకండ్ పార్ట్ లో అనే అని మేకర్స్ కూడా చెప్పడంతో ఎప్పుడెప్పుడు కల్కి సినిమాకు సీక్వెల్ వస్తుందా ? అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కల్కి సీక్వెల్లో కూడా దీపికానే ఉంటుందని ముందుగా మేకర్స్ ప్రకటించారు. అదే టైంలో దీపిక తన గర్వం చూపించింది. స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే అక్కడ కళ్ళు చెదిరే పారితోషకంతో పాటు ఏడు గంటలు పని చేస్తానని .. లగ్జరీ ట్రీట్మెంట్ కావాలని ఇలా ఒకటని చెప్పలేము ఇవన్నీ చూసిన సందీప్ దీపికను పక్కనపెట్టి తృప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నారు.
అక్కడితో ఆగని దీపిక స్పిరిట్ కథను తన పి ఆర్ ల చేత లీక్ చేయించి నెగిటివ్ చేయించింది. ఇంత జరిగిన దీపికలో మార్పు రాలేదు. ఇప్పుడు కల్కి 2 సినిమాకు కూడా పార్ట్ వన్ కు ఇచ్చిన రెమ్యూనరేషన్ పై 25% ఎక్కువ ఇవ్వాలని.. మొదటి చెప్పిన విధంగా ఏడు గంటల మాత్రమే పని చేస్తానని చెప్పిందట. అంతేకాకుండా తనతో పాటు తన 25 మందికి లగ్జరీ ట్రీట్మెంట్ కావాలని.. దాని ఖర్చు అంతా నిర్మాతలు భరించాలని చెప్పినట్టు సమాచారం. కల్కి చాలా పెద్ద సినిమా.. ఈ సినిమాకు ప్రభాసే రెమ్యూనరేషన్ పెంచాలని అడగలేదు. ఇప్పుడు దీపిక గొంతెమ్మ కోరికలు చూసిన నిర్మాతలు మన పక్కన పెడుతున్నట్టు అధికారికంగా ప్రకటన చేయాల్సి వచ్చింది.