విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సంకేతనరికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా ఒకటని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. బడ్జెట్ కలెక్షన్ల లెక్కల ప్రకారం ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అని కచ్చితంగా చెప్పవచ్చు.

నిర్మాత దిల్ రాజు ఈ సినిమా సక్సెస్ సాధించడం వల్లే కోలుకున్నారు.  గేమ్ చేంజర్ సినిమా మిగిల్చిన నష్టాలను ఈ సినిమా భర్తీ చేసిందని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీమేక్ కు సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు హిందీ భాషపై ఫోకస్ పెట్టారని  సమాచారం అందుతోంది. హిందీలో ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా నెమ్మదిగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు ప్రాజెక్ట్ లను ప్లాన్ చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా హిట్ గా నిలిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. నిర్మాత దిల్ రాజు కెరీర్ పరంగా తప్పులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.  విక్టరీ వెంకటేష్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటుండగా భవిష్యత్తు సినిమాలు వెంకటేష్ కు ఏ స్థాయి విజయాలను అందిస్తాయో చూడాల్సి ఉంది. వెంకటేష్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాతో వెంకీ మామ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: