
ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు విడుదలవుతుందా అంటూ చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు సైతం తాజాగా తెరపడింది. ఈ రోజున 12:30 PM కి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఈ యానిమేటెడ్ మూవీ అందుబాటులో ఉన్నట్లు తెలియజేసింది. డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హోంభలే ఫిలిమ్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
యానిమేషన్ తో కూడా ఇలా మాయ చేయవచ్చా అనేలా కనిపిస్తోంది. భారతదేశంలోని అత్యధిక కలెక్షన్స్ రాబట్టినటువంటి యానిమేటెడ్ మూవీగా మహావతార్ నరసింహ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమాని చూసిన చాలామంది సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. మహావతార్ నరసింహకు సంబంధించి ఏడు చిత్రాలుఉన్నాయంటూ హోంబలే సంస్థ ప్రకటించింది. మొత్తానికి ఎట్టకేలకు ఓటీటీలో మహావతార్ నరసింహ సినిమా వస్తోందనీ తెలిసి చూడడానికి చాలామంది ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. మరి ఓటీటిలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.