టాలీవుడ్‌లో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో ఒకటి “మిరాయ్”. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించాడు. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలు మంచి హైప్ క్రియేట్ చేయగా, రిలీజ్ రోజున ఆ హైప్‌ని సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్‌ వద్ద క్యాష్ చేసుకుంది. ముఖ్యంగా తేజ సజ్జ కెరీర్‌లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు నుంచే థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండగా, వీకెండ్ కల్లా కలెక్షన్లు మరింత ఊపందుకున్నాయి. ఫలితంగా తొలి వారం రోజుల్లోనే 112.10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తేజ సజ్జ స్థాయిని బట్టి ఈ ఫిగర్స్ నిజంగా సంచలనంగా చెప్పుకోవాలి. దీంతో ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్‌ని ప్రదర్శించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


సినిమాలో గౌర హరి అందించిన సంగీతం కథాకథనానికి బలాన్ని చేకూర్చింది. హీరోయిన్ రితికా నాయక్ తన అందంతో, నటనతో ఆకట్టుకోగా, మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్‌గా తెరపై మెరిశాడు. శ్రేయ, జైరాం తదితరులు తమ తమ పాత్రల్లో మెప్పించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం, విజువల్స్‌కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు నిర్మించిన ఈ చిత్రం, ప్రొడక్షన్ వ్యాల్యూస్‌లో ఎక్కడా రాజీపడలేదు. హై క్లాస్ టెక్నికల్ వర్క్‌తో పాటు మాస్, క్లాస్ ఎలిమెంట్స్‌ని మిళితం చేయడం వల్ల ప్రతి వర్గాన్నీ ఆకట్టుకుంటోంది. మొత్తంగా చూస్తే, తేజ సజ్జ కెరీర్‌ని మరోస్థాయికి తీసుకెళ్లే బ్లాక్‌బస్టర్‌గా “మిరాయ్” నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: