సినిమా ఇండస్ట్రీ లో ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో రూపొందించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒకరితో సినిమాను అనుకొని వారితో షూటింగ్ కూడా స్టార్ట్ చేసి కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక ఆ మూవీ నుండి వారిని తీసేసి మరొకరిని పెట్టు కోవడం మాత్రం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఓ ముద్దుగుమ్మను ఓ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఆమెపై కొన్ని రోజుల సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమెను తీసేసి ఆ స్థానంలో వేరే హీరోయిన్ను పెట్టుకున్నారు.

ఆ తర్వాత ఆమె వేరే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఆ తర్వాత ఎన్నో విజయాలను అందుకొని ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎరిగింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. 

ఆ తర్వాత ఈమె నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అలా చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గానే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే ఈమెను మొదట ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్గా ఎంచుకున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించారు. మొదట కాజల్ అగర్వాల్ ప్లేస్ లో రకుల్ ను సెలెక్ట్ చేసుకుని ఆమెపై కొన్ని రోజులు షూటింగ్ కూడా చేసి ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆమెను ఆ సినిమా నుండి తీసేశారు. ఇక మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో అవకాశాన్ని కోల్పోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: