టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.  ఈరోజు ఏఎన్నార్ 101వ జయంతి కాగా  ఈ సందర్భంగా నాగార్జున కీలక విషయాలను వెల్లడించారు.  సినిమా ఇండస్ట్రీ నుంచి నేను పైకొచ్చానని నాగ్ అన్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్ నాన్న కల అని నాగ్  కామెంట్లు చేశారు.  నా వందో సినిమాని త్వరలోనే మొదలుపెడతానని  అఖిల్ లెనిన్ షూట్  జరుగుతోందని  వచ్చే ఏడాది నుంచి అన్నపూర్ణ బ్యానర్ నుంచి వరుసగా సినిమాలు వస్తాయని నాగ్ కామెంట్లు చేశారు.

నాన్న పుట్టినరోజూ అంటే మా అందరికీ  పండగ అని  స్టూడియోలో నాన్న విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత తృప్తిగా ఉందని నాగ్ చెప్పుకొచ్చారు.  నాన్న బయోపిక్ తీయాలనే ఆలోచన ఉందని  ఎవరు రాస్తే బాగుంటుంది  ఎంత ఆసక్తికరంగా తీయాలనే  చర్చలు జరుగుతున్నాయని అన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత ఆ వివరాలు చెబుతానని నాగార్జున కామెంట్లు చేశారు.  నాన్న వస్తున్నారంటే స్టూడియో లోపల హడావిడి ఉండేదని  స్టూడియోకు అమ్మ పేరు పెట్టాలనే నిర్ణయం  నాగార్జున గారిదే అని  నాగ్ పేర్కొన్నారు.

నాగార్జున కూలీ సినిమాలో నెగిటివ్ షేడ్స్  ఉన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.  నాగార్జున  తన  సినీ కెరీర్ లో కొత్త డైరెక్టర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇచ్చారు. నాగచైతన్య ఈ ఏడాది తండేల్  సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా  అఖిల్  కూడా లెనిన్  సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్  భావిస్తున్నారు.

అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా సరైన అడుగులు వేసి భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాలకు సంబంధించి అఖిల్ కెరీర్ ప్లాన్స్  కు సంబంధించి పూర్తిస్థాయిలో  స్పష్టత రావాల్సి ఉంది.  అక్కినేని హీరోలు భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: