పవన్ కళ్యాణ్ సినిమా అంటే హీరో క్యారెక్టర్ ఎంత హైలెట్ అవుతుందో, ఆ తర్వాత హీరోయిన్ రోల్ కూడా అంతే హైలెట్ అవుతుంది. పవర్ స్టార్ సినిమాల్లో హీరోయిన్‌కి ఇచ్చే ప్రాధాన్యం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే ఛాన్స్ చాలా అరుదుగా దొరుకుతుంది. అలాంటి అవకాశం దక్కితే, ఎలాంటి బ్యూటీ అయినా, అది కొత్త హీరోయిన్ అయినా, ఇండస్ట్రీలో టాప్ స్టార్ అయినా కూడా, రెండోసారి ఆలోచించకుండా అంగీకరిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో నటించడం అనేది కెరీర్‌లో ఓ మైలురాయిగా మారుతుంది.


అయితే అలాంటి అరుదైన అవకాశాన్ని రిజెక్ట్ చేసిన హీరోయిన్‌గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకరిపేరు బాగా వైరల్ అవుతోంది. ఆమె మరెవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా చర్చకు వస్తోంది. పవన్ కళ్యాణ్–నయనతార కాంబినేషన్‌లో కనీసం ఒక సినిమా అయినా రావాలని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో సినిమాలు సెటప్‌లోకి వచ్చాయని, కాని చివరి వరకు వెళ్లకుండానే రద్దు అయ్యాయని ఎన్నోసార్లు వార్తలు వచ్చినా, ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఓజీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ప్రియాంక ఆర్మూళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మొదట ఈ పాత్ర కోసం నయనతారను అప్రోచ్ చేశారట. కానీ క్యారెక్టర్ చిన్నది, స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని భావించి నయనతార ఆ ఆఫర్‌ను తిరస్కరించిందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.



ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో చర్చలు జోరుగా మొదలయ్యాయి. “పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో నటించే ఛాన్స్ దక్కి కూడా వదులుకున్నావా? నీ నిర్ణయం నిజంగా సరైనదేనా?” అంటూ నయనతారను నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు “ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ సినిమాతో వచ్చే క్రేజ్ వేరేలా ఉంటుంది. అలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకోవడం పెద్ద తప్పే” అని కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి, పవన్ కళ్యాణ్–నయనతార కాంబోలో సినిమా ఎప్పుడైనా నిజమవుతుందా అన్నదే ఫ్యాన్స్‌కి మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఓజీ విడుదల హీట్ మధ్యలో ఈ నయనతార ఎపిసోడ్ మరోసారి హాట్ డిబేట్‌గా మారి, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: