
కొంతమంది అయితే, “అప్పుడెప్పుడో ఖుషి, గుడుంబా శంకర్ రోజుల్లో ఎలా పవన్ కళ్యాణ్ మాస్, ఎనర్జీతో కనిపించేవాడో, అదే ఫీల్‌ను మళ్లీ తెరపై చూపించావు సుజిత్, థాంక్యూ” అంటూ సోషల్ మీడియాలో డైరెక్టర్ సుజిత్‌ను ప్రశంసలతో ముంచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేయగా, థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ సినిమాకోసం ఎదురుచూస్తూ, కౌంట్‌డౌన్ వేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే.
చివరికి థియేటర్లో సినిమా చూసిన తర్వాత వారి వెయిటింగ్ వృథా కాలేదని, ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డైలాగ్, అలాగే మ్యూజిక్ కూడా అద్భుతంగా పండిందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా “ఈ సినిమా థియేటర్లోనే చూడాలి” అనే పాయింట్‌ను ప్రతి ఒక్క అభిమాని హైలైట్ చేస్తున్నారు.ఈ సినిమాలో తమన్ ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఉందని, ఆయన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సౌండ్ సిస్టమ్‌తో కలిపి విన్నప్పుడే తమన్ మ్యూజిక్ అసలైన రేంజ్‌లో ఎంజాయ్ చేయగలమని సోషల్ మీడియాలో రకరకాల రివ్యూలు వస్తున్నాయి.
అంతేకాదు, సెకండ్ హాఫ్‌లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. “ఆ సీన్ చూడటానికి మాత్రం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ థియేటర్‌కి వెళ్లాల్సిందే” అంటూ సూచనలు చేస్తున్నారు. ఆ సీన్‌లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ చూసినప్పుడు అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులకూ గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ చెబుతున్న మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, “పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్లోనే చూడాలి. స్క్రీన్ మీద ఆయన ఎంట్రీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఫ్యాన్స్ కేరింతలు, అరుపులు, కేకలు – ఇవన్నీ కలిసిపోతేనే అసలైన ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మాత్రమే సినిమా అనుభూతి పూర్తి అవుతుంది.”
అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఒకే మాట చెబుతున్నారు – “అలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి. దగ్గరలోని థియేటర్లో టికెట్ బుక్ చేసుకుని వెళ్లి ఓ జి సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.” అని.ఇలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విపరీతమైన ఎమోషనల్ పోస్ట్‌లు పెడుతూ, రకరకాల కామెంట్స్ షేర్ చేస్తూ, ఓ జి సినిమాను పండుగలా మార్చేస్తున్నారు.